Advertisement
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ రద్దు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. జానీ మాస్టర్ బెయిల్ రద్దు గురించి కాంగ్రెస్ మంత్రి కామెంట్స్ చేశారు. ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆయన మాట్లాడారు, కర్ణాటక మంత్రి దినే గుండు రావు మాట్లాడుతూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వ్యక్తులని ప్రజలు సహించరని చెప్పారు. అలాంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
Advertisement
ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలలో మహిళల పాత్ర పెరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. మహిళలపై వేధింపుల్ని అరికట్టి ఇబ్బందులు లేని వాతావరణాన్ని సృష్టించాలని.. అది ప్రభుత్వం బాధ్యతని ఆయన చెప్పారు. ఈ విషయంలో బీజేపీ సర్కార్ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని అన్నారు.
Advertisement
Also read:
మాజీ సీఎం యడ్యూరప్పపై కూడా పోక్సో కేసు నమోదు అయిందని జూలై నెలలో CID దాఖలు చేసిందని అన్నారు. 700 పేజీల చార్జిషీట్ ని దాఖలు చేసిందని కామెంట్లు చేయడం గమనార్హం. ఎడ్యూరప్పను పార్లమెంటరీ బోర్డు సభ్యుడుగా ఎందుకు కొనసాగిస్తున్నారని అడిగారు. కేసు విచారణ జరిగే దాకా ఆయనను పార్టీ పదవుల నుంచి తప్పించలేరని అడిగారు మంత్రి చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!