Advertisement
కర్నాటకలో మంత్రి సోమన్న వ్యవహారం దుమారం రేపుతోంది. హంగాల గ్రామంలో కార్యక్రమానికి హాజరైన ఆయన భూ క్రమబద్దీకరణకు సంబంధించిన టైటిల్ డీడ్ లను పంపిణీ చేశారు. అయితే.. ఓ మహిళకు అధికారులు పట్టా ఇవ్వలేదు. తనకెందుకు ఇవ్వరంటూ ఆమె అధికారులను ప్రశ్నించింది. సరిగ్గా అదే సమయంలో మంత్రి ఆమె చెంప చెళ్లుమనిపించారు.
Advertisement
మంత్రి చర్యతో అందరూ షాక్ తిన్నారు. అయితే.. సదరు మహిళ మాత్రం మంత్రి పాదాలకు దండం పెట్టి తన బాధను చెప్పుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. గతేడాది కూడా ఓ మహిళా రైతును కర్ణాటక న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి తిట్టారు. గత నెలలో మరో మంత్రి అరవింద్ లింబావలి ఓ మహిళను తిట్టిన వీడియో వైరల్ అయింది.
Advertisement
అధికార పార్టీ నేతలు ఎప్పుడు దొరుకుతారా అని కాచుకుని కూర్చున్న ప్రతిపక్షాలకు అవకాశం కల్పించారు మంత్రి సోమన్న. ఆయన చెంపదెబ్బ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. మహిళ పట్ల ఆయన వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వెంటనే సోమన్నను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మంత్రి సోమన్న రాజీనామా అయినా చేయాలి లేదా ఆయనను సీఎం బొమ్మై ప్రభుత్వం డిస్మిస్ చేయాలని సీనియర్ నేత సుర్జేవాలా డిమాండ్ చేశారు.
బీజేపీ ప్రభుత్వం మహిళా వ్యతిరేకి అని ఆరోపించారు జనతాదళ్-ఎస్ అధికార ప్రతినిధి తన్వీర్ అహ్మద్. 30 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నాడని చెబుతున్న మంత్రి ఇలాగే వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. తన ట్వీట్ ని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ను ట్యాగ్ చేస్తూ వీడియోను జత చేశారు అహ్మద్.