Advertisement
ప్రేమీ విశ్వనాధ్ వంటలక్కగా పేరు తెచ్చుకున్నారు. ఆమె గురించి అందరికీ తెలుసు. ఆమె గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. కార్తీకదీపం సీరియల్ తో ఆమె పాపులర్ అయిపోయారు. అయితే ఆమె భర్త గురించి చాలా మందికి తెలియదు. అతను కూడా ఇండస్ట్రీలో చాలా ఫేమస్. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. అతని గురించి మరిన్ని వివరాలు చూద్దాం. 2017లో వరల్డ్స్ బెస్ట్ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క దీప పాత్రలో అద్భుతంగా నటించి అందర్నీ మెప్పించింది.
Advertisement
ఈ సీరియల్ అంతా దీప, డాక్టర్ బాబు, మోనిత పాత్రల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కార్తీక్ తన భార్య దీపని అనుమానించడం, తను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి దీప ప్రయత్నం చేయడం ఈ పాయింట్ తో ఏళ్లకు ఏళ్లు సీరియల్ ని నడిపించేసారు. మలయాళం నటి ప్రేమీ విశ్వనాధ్ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది వంటలక్కగా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోయింది.
Advertisement
Also read:
ఈమె మలయాళం లో కూడా పలు సీరియల్స్ లో నటించింది. కేవలం ఒకే ఒక కార్తీకదీపం సీరియల్ తో తెలుగులో ఎక్కడలేని ఫేమ్ సంపాదించుకుంది. ప్రేమి విశ్వనాథ్ భర్త పేరు డాక్టర్ వినీత్ భట్. కేరళలో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు. 2017 బెస్ట్ ఆస్ట్రాలజర్ గా పేరు తెచ్చుకున్నారు. వీళ్ళ కొడుకు సూపర్ హైట్ తో శరీర దారుణ్యంతో ఉంటారు. నిజానికి హీరోగా నటించడానికి కావాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రేమీ విశ్వనాథ్ ఇప్పుడు కార్తీకదీపం 2 తో ప్రేక్షకులు మనసు దోచుకుంటోంది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!