Advertisement
MLC Kavitha: లిక్కర్ స్కాంలో మొదట్నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు వినిపిస్తోంది. అయితే.. తనకు దీంతో సంబంధం లేదని చెబుతూ వస్తున్నారామె. కేసులో ఆమెకు దగ్గర మనుషులుగా భావిస్తున్న వారిని అరెస్ట్ చేశాక.. ఒక్కో ఉచ్చు బిగుసుకుంటూ వెళ్తోందని విమర్శలు వినిపించాయి. తాజాగా ఈడీ కవితను ప్రశ్నించింది. 9 గంటలపాటు ఈ విచారణ కొనసాగించింది.
Advertisement
శనివారం 11 గంటలకు ఈడీ ఆఫీస్ కు వెళ్లారు కవిత. తిరిగి రాత్రి 8 గంటలకు బయటకు వచ్చారు. విచారణలో బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై వాంగ్మూలాలు, ఆధారాలు ధ్వంసం చేయడంపై ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. డిజిటల్ ఆధారాలు లభించకుండా చేశారనే ఆరోపణలపై అధికారులు వివరాలు సేకరించినట్టు సమాచారం. అలాగే, ఈనెల 16న మరోసారి విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది.
ఈడీ ఆఫీస్ నుంచి బయటకు రాగానే జై కవిత నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వచ్చి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లారు. నేరుగా ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు కవిత. అక్కడ మంగళహారతులు ఇచ్చి దిష్టి తీశారు. అక్కడ కొన్ని నిమిషాలు ఉన్న కవిత.. ప్రత్యేక విమానంలో తర్వాత హైదరాబాద్ పయనమయ్యారు.
Advertisement
కవితకు ఈడీ నుంచి ఎదురైన ప్రశ్నలు (ప్రచారంలో ఉన్నవి)
1. మద్యం పాలసీలో మార్పులు చేసింది మీరేనా?
2. మార్పుల వెనుక ఎవరెవరి పాత్ర ఉంది? సిసోడియాతో పరిచయం ఎలా ఏర్పడింది?
3. ఢిల్లీ గవర్నమెంట్ కు- సౌత్ గ్రూప్‌నకు మధ్యవర్తి మీరేనా?
4. ఢిల్లీ మద్యం వ్యాపారంతో మీకున్న సంబంధమేంటి?
5. సౌత్ గ్రూప్ తో మీకున్న సంబంధాలేంటి?
6. అరుణ్ రామచంద్ర పిళ్లై మీకు బినామీనా కాదా?
7. మీ ప్రతినిధని పిళ్లై చెప్పిన దాంట్లో నిజమెంత?
8. పిళ్లైకు.. మీకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా?
9. రామచంద్రతో వ్యాపారం చేస్తే నాతో చేసినట్లే అని మీరు చెప్పలేదా?
10. లిక్కర్ స్కాంలో మీ పాత్ర ఉందా.. లేదా?
11. ఛార్టెడ్ ఫ్లైట్ లో వెళ్లి రూ.130 కోట్లు లంచం ఇచ్చారా?
12. ఆ 130 కోట్ల డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది.. ఎవరిచ్చారు?
13. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎప్పుడైనా కలిశారా?
14. ఛార్డెడ్ ఫ్లైట్ మీకు ఎవరు సమకూర్చారు?
15. ఫేస్ టైమ్ లో మీరు సమీర్ మహేంద్రుతో మాట్లాడారా.. లేదా?
16. శరత్ చంద్రారెడ్డిని ఎన్నిసార్లు కలిశారు?
17. శరత్ చంద్రతో తరుచూ మాట్లాడాల్సిన అవసరం ఏంటి?
18. ఆధారాలు మాయం చేసేందుకు సెల్ ఫోన్లు ధ్వంసం చేశారా?
19. సెల్ ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు?
20. గోరంట్ల బుచ్చిబాబుకు మీకున్న సంబంధమేంటి?