Advertisement
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ సీఎం కేసీఆర్ యాక్టివ్ గా లేరు. అసెంబ్లీకి కూడా రావట్లేదు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా తన కూతురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై విడుదల అయ్యారు. ఆమె ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఆయన హైదరాబాద్ రాలేదు. ఫామ్ హౌస్ లోనే ఉండిపోయారు. కవిత స్వయంగా ఎర్రబెల్లిలోని కేసీఆర్ ఇంటికి వెళ్లి తండ్రిని కలిశారు. తన భర్త కొడుకులతో కలిసి వచ్చిన ఆడబిడ్డకు పుట్టింట్లో ఆత్మీయ ఆహ్వానం అందింది.
Advertisement
దిష్టి తీసి కుటుంబ సభ్యులు ఆమెకి ఆహ్వానం పలికారు. కన్న బిడ్డను చూడగానే కేసీఆర్ భావోద్వేగం చెందారు. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోస్ ని చూస్తే తండ్రీ కూతుర్ల భావోద్వేగాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కవిత ఈ కేసు నుంచి ఇంకా నిర్దోషిగా తేలకపోయినా కనీసం నిందితురాలుగా ఉంటూ బెయిల్ పైకి రావడంతో కేసీఆర్ ఆనందపడుతున్నా లోలోపల మాత్రం బాధపడుతున్నారు.
Advertisement
Also read:
తన తండ్రి పాదాలకు నమస్కరించిన కవితను ఆయన ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఆశీర్వాదం ఇచ్చారు. ఈ కేసులో కవిత నిర్దోషిగా వచ్చి ఉంటే కేసీఆర్ కళ్ళల్లో అసలైన ఆనందం కనబడేది. కానీ తన కూతురు ఓ కేసులో చిక్కుకుందనే ఆవేదన ఆయన మనసులో ఉంది. దాదాపు 5 నెలల తర్వాత జైలు నుంచి బయట వచ్చింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత విచారంగా ఉన్న కేసీఆర్ చాలా కాలం తర్వాత కొంత ఉత్సాహంలో కనిపించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!