Advertisement
నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో పదునాలుగు విజయాలతో కేసీఆర్ కెరీర్ లో ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. అలాంటి కేసీఆర్ కు తెలంగాణ ఎన్నికల్లో ఓటమి కొంచం షాక్ కలిగించే విషయమే. అయితే.. కెసిఆర్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలయింది. ఆ తరువాత ఎన్టీఆర్ హవా మొదలవడంతో.. ఆయన టీడీపీ పార్టీ కి మారారు. అయితే.. కెరీర్ ప్రారంభంలో కూడా కేసీఆర్ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అది ఎప్పుడో తెలుసుకుందాం.
Advertisement
కేసీఆర్ మొదటిసారి 1983లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసారు. ఆ సంవత్సరం ఆయన టీడీపీ పార్టీ తరపున పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థిగా అనంతుల మదన మోహన్ పోటీ చేసారు. మదన్ మోహన్ చేతిలో కేసీఆర్ కు పరాజయమే ఎదురయ్యింది. ఎలాంటి రాజకీయ నేపధ్యం లేకుండా రాజకీయాల్లోకి వచ్చి.. మొదటి సారి ఓడిపోవడంతో ఆయన చాలా బాధపడ్డారట. నిజానికి ఆయన మొదటి సారి పోటీ చేస్తుండడంతో.. ఆయన తరపున ఎన్టీఆర్ వచ్చి ప్రచారం చేస్తారని అన్నారట. కానీ, పనుల కారణంగా ఎన్టీఆర్ ప్రచారానికి రాలేకపోయారు.
Advertisement
కేసీఆర్ ప్రచారం చేసుకున్నా.. ప్రజల్లో యాక్టివ్ గానే ఉన్నా ఆయన ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనితో ఆయన కన్నీరు మున్నీరయ్యారట. ఎన్టీఆర్ ను కలిసి కన్నీళ్లు పెట్టుకుని.. తన గోడు వెళ్లబోసుకున్నారని ఇప్పటికి రాజకీయ వర్గాల్లో కొందరు సీనియర్లు చెబుతూ ఉంటారు. ఓటమితో డీలాపడిన కేసీఆర్ కొన్ని రోజుల పాటు కార్యకర్తలను కూడా కలవలేదట. కానీ.. ఎన్టీఆర్ కేసీఆర్ కు హితబోధ చేసి ధైర్యాన్ని ఇవ్వడంతో.. ఆయన తిరిగి పుంజుకున్నారు. రాజకీయాల్లో తిరుగు లేని శక్తిగా ఆయన దూసుకెళ్లారు. తెలంగాణ కోసం గట్టిగానే పోరాడారు. ఆ సమయంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి అప్పట్లో సంచలనానికి తెరలేపారు. ఓటమిని గెలుపు పాఠంగా మార్చుకుని ముందుకెళ్లారు. ఇన్ని సంవత్సరాల తరువాత.. మళ్ళీ ఈసారి ఎలక్షన్స్ లోనే ఆయన ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది.
Read More
బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ! వీళ్ళకి జరిగింది మరెవరికి ఇలా జరగదు ఏమో ? అదృష్టం ఉండాలి బాస్ !
పిల్లర్ నెంబర్ 9 రైల్వే స్టేషన్ ! ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ
ఎన్టీఆర్ తన పిల్లల స్కూల్ ఫీజ్ కోసం ఇంత ఖర్చు చేస్తున్నారా? ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!