Advertisement
ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కవిత గారు సుపరిచితురాలు. ఆమె భారత రాష్ట్ర సమితి పార్టీ సభ్యురాలు. ఆమె 2014 నుండి 2019 వరకు నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహించారు. ఆమె తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమార్తె. ఆమె ఓ మంచి రాజకీయ వక్త కూడా. రాజకీయాల పరంగా ఎంత బిజీగా ఉన్నా.. ఓ కూతురుగా, భార్యగా, తల్లిగా ఆమె తన బాధ్యతలను ఎల్లప్పుడూ నిర్వరిస్తూ వచ్చారు. అయితే.. అడుగడుగునా ఆమెకు సపోర్ట్ ఇస్తూ.. ఆమె వెంట ఉండి నడిపిస్తున్న ఆమె భర్త దేవనపల్లి అనిల్ కుమార్ గారి గురించి చాలా మందికి తెలియదు.
Advertisement
ఆమె ఫారిన్ లో చదువుకుంటున్న సమయంలోనే కేసీఆర్ గారు టీడీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి స్వతంత్ర తెలంగాణ నినాదంతో టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసారు. అయితే.. కవిత గారి చదువు పూర్తి అయ్యి ఇండియాకు రాగానే నిజామాబాద్ జిల్లాకు చెందిన దేవరపల్లి అనిల్ కుమార్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలనీ అనుకున్నారు. వారిద్దరికీ పెళ్లి చూపులు ఏర్పాటు చేసారు. వారిద్దరి అభిప్రాయాలూ కలవడంతో పెళ్ళికి ఓకే చెప్పారు. అనిల్ కుమార్ కు రాజకీయాలపై ఆసక్తి లేదు. అసలు ఆయనకు ఎంగేజ్ మెంట్ అయ్యే వరకు కేసీఆర్ గారు స్థాపించిన టిఆర్ఎస్ పార్టీ ఫుల్ ఫామ్ ఏమిటో కూడా తెలియదట.
Advertisement
అనిల్ కుమార్ పెళ్ళికి ముందు యూ ఎస్ లో మెకానికల్ ఇంజనీర్ గా పని చేసారు. ఆయన 2003 లో కవిత గారిని వివాహం చేసుకున్నారు. పెళ్లి అయ్యాక ఇద్దరు యూ ఎస్ లోనే ఉన్నారు. కవిత గారు కూడా యూ ఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసారు. అయితే.. అక్కడ కల్చర్ బోరు కొట్టి ఇండియాకు వచ్చేసారు. ఇండియాకు వచ్చాక అనిల్ కుమార్ రియల్ ఎస్టేట్ వైపు వెళ్లారు. కవిత గారు రాజకీయాల వైపు వచ్చారు. అనిల్ కుమార్ సర్వీస్ అపార్ట్మెంట్స్ మరియు కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసారు. కవిత గారు రాజకీయాల్లోకి వచ్చేసరికే వారికి ఆదిత్య అనే కొడుకు పుట్టాడు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కవిత గారు కూడా తండ్రి అడుగు జాడల్లో రాజకీయాల్లోకి వచ్చారు. ఇక రాజకీయాలలో అనిల్ కుమార్ కవితగారికి చాలా సపోర్ట్ ఇచ్చారు. కవిత గారు జాగృతి సంస్థకు డైరెక్టర్ గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ బాధ్యతల్లో కూడా అనిల్ కుమార్ పాలు పంచుకుంటారు.
Read More:
గుంటూరు కారం సినిమాలో పవన్, చంద్రబాబు కి ఇచ్చిన ఇండైరెక్ట్ సపోర్ట్ గమనించారా?