Advertisement
తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఎంత ఉన్నతంగా దూసుకెళ్తారో ఎవ్వరికి కొత్తగా చెప్పక్కర్లేదు. తాజాగా.. ఆయన తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ప్రజలు ఫుల్ జోష్ లో ఉన్నారు. మరోవైపు ప్రత్యర్ధులు షాక్ లో ఉన్నారు. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లు.. ఒక్క నిర్ణయంతో ఇటు ప్రజల మన్నన పొందడంతో పాటు.. అటు ప్రత్యర్థులకు కూడా చెక్ పెట్టేసారు కేసీఆర్. రాజకీయ విశ్లేషకులు సైతం ఇది కదా కేసీఆర్ మార్క్ రాజకీయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి: చంద్రబాబుని అరెస్ట్ చేస్తారన్న విషయం ఎన్టీఆర్ కు ముందే తెలుసా? ఎన్టీఆర్ మౌనం వెనుక ఆ ప్రముఖ రాజకీయ నేత?
ఇవి కూడా చదవండి: చంద్రబాబు అరెస్ట్ పై “సీ ఓటర్ సర్వే” లో సంచలన విషయాలు వెలుగులోకి..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెల మొదటిలోనే షెడ్యూల్ విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ ఎన్నికల కోసం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గారంటీ పథకాలకు చెక్ పెట్టడం కోసం కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 29న జరిగే మంత్రివర్గ సమావేశంలో అనూహ్య నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ పాగా వెయ్యాలని చూస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను సోనియా గాంధీ ప్రకటించారు.
Advertisement
ఇవి కూడా చదవండి: గుడివాడలో టీడీపీ గెలుస్తుందా..? సర్వేలు ఏం చెబుతున్నాయంటే..?
అయితే.. వీరికి చెక్ పెట్టి వరుసగా మూడవసారి గెలవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన కొత్త నిర్ణయాల విషయమై కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ పై రూ 600 -700 వరకు సబ్సిడీ ఇవ్వబోయేటట్లు నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతి ఏడాది 6 – 8 సిలిండర్లకు ఈ సబ్సిడీ అందేలా చూడనున్నారు. అయితే ఈ సబ్సిడీ పేద కుటుంబాలకు మాత్రమే అందేలా చేయనున్నారు. అలాగే ఇప్పుడు ఉన్న పెన్షన్ ను కూడా మూడువేల నూటొక్క పదహారు రూపాయలకు పెంచనున్నారు.
ఇవి కూడా చదవండి: జగన్ జాతకం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన వేణుస్వామి…. ఏమన్నారంటే?
అలాగే ఉద్యోగులకు కూడా పెండింగ్ లో ఉన్న డిఏ లో ఒకటి విడుదల చేస్తూ నియామకాలకు ఆమోదం తెలపనున్నారు. అనాధ పిల్లల కోసం కొత్త పథకాలు, ఉద్యోగుల కోసం హెల్త్ స్కీం లు, ఇంటి స్థలాలు వంటి అంశాలపై కూడా స్కీం ల గురించి చర్చించనున్నారు. ప్రతిపక్షాలకు అస్సలు అవకాశం లేకుండా ఈ పథకాలను రూపొందించనున్నారు.