Advertisement
Lakshmi Devi: ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. సంతోషంగా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండాలి. లక్ష్మీదేవిని పూజిస్తే ధనంతో పాటుగా శుభం కూడా కలుగుతుంది. హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ధనానికి ఐశ్వర్యానికి అధిపతి. ఆమెని పూజిస్తే అన్ని శుభాలు కలుగుతాయి. ధనం మిక్కిలి సమకూర్తుంది. వ్యాపారస్తులయితే కచ్చితంగా షాపుల్లో దుకాణాల్లో అలానే ఇతర ప్రదేశాల్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకుంటూ ఉంటారు. అలా చేయడం వలన డబ్బులు బాగా వస్తాయి అని నమ్ముతారు. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధించాలంటే పూజ మాత్రమే కాదు కొన్ని పనులు కూడా చేయాలి.
Advertisement
లక్ష్మీదేవి కటాక్షం ఇలా మీకు కలుగుతుంది. లక్ష్మీదేవి కోసం ఏమేం చేయాలో ఇప్పుడు చూద్దాం. నెమలి పింఛం ని తెచ్చుకుని దాన్ని ఇంట్లో మీరు లక్ష్మీదేవిని పూజించే చోట పెట్టుకోవాలి. ఇలా చేస్తే అనుగ్రహం కలుగుతుంది. సరస్వతి దేవి కూర్చున్నది నెమలి మీదే కదా అందుకని నెమలి పింఛం ఇంట్లో పెట్టుకోవడం వలన నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. బంగారం లేదా వెండితో చేసిన నాణెం ని పూజ గదిలో పెట్టాలి ఆ నాణెం పై లక్ష్మీదేవి వినాయకుడు ఉంటే చాలా మంచిది. దానితో సంపద బాగా పెరుగుతుంది.
Advertisement
తామర పువ్వులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. తామర పువ్వు మీద కూర్చున్న లక్ష్మీదేవి ని పూజిస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది. ధనం కూడా బాగా వస్తుంది. ఇలా మీ ఇంట్లో ఈ పద్ధతులు కనుక పాటించారంటే, లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా కలుగుతుంది. డబ్బులు బాగా వస్తాయి. మహిళలు నుదుట ధరించే కుంకుమ, చేతులకు వేసుకునే గాజులు, గోరింటాకు వంటి అలంకరణ వస్తువులను ఇంట్లో ఉంచడం చాలా మంచిది. దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో వాళ్లకి అంతా మంచి జరుగుతుంది. సంపద కూడా బాగా వస్తుంది. మరి ఈసారి ఈ విషయాన్ని ఖచ్చితంగా పాటించండి సంతోషంగా ఉండండి ఏ బాధలు లేకుండా ఉండవచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!