Advertisement
ప్రతీ సంవత్సరం హిందువులు వినాయక చవితి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. వినాయక చవితి రోజు పాటించాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. దేశవ్యాప్తంగా చిన్న నుంచి పెద్ద వరకు ఎప్పుడు అని వినాయక చవితి పండుగ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తారు. అందరూ ఎదురు చూస్తున్న పండగ రానే వచ్చింది. గ్రామాల దగ్గర నుంచి పట్టణాలు నగరాల వరకు ఈ గణపతి నవరాత్రులను ఎంతో ఘనంగా జరుపుతారు. ఈ వినాయక చవితి ప్రతి ఏటా భద్రపదం మాసం శుక్లపక్ష చవితి రోజున వస్తుంది. వినాయకుడు జన్మదినం కావున అన్ని విఘ్నాలను తొలగించే మహాగణపతిని ఆరోజు భక్తులతో పూజలు చేస్తారు.
Advertisement
Advertisement
ఏ సమయానికి విగ్రహాన్ని పెట్టాలి అనేది ఇప్పుడు చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చవితి నాడు గణపతి విగ్రహ ప్రతిష్టాపనకు శుభ ముహూర్తం ఉదయం 11:03 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్యలో ఉందని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఒకవేళ వీలు కాకపోతే మళ్లీ సాయంత్రం 6:02 నుంచి 7:30 మధ్యలో వినాయకుడిని ప్రతిష్టించి వ్రత సంకల్పం చేసుకోవచ్చని తెలిపారు.
Also read:
కనుక చవితి రోజున ఆ సమయంలో గణపతిని పూజించడం ప్రతిష్టించడం చాలా మంచిది. మహాగణపతికి ఎరుపు రంగు వస్త్రం అంటే ఎంతో ఇష్టం. కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకుంటే మంచిది. వినాయక చవితి రోజు నీలం రంగు వస్త్రాలు వేసుకుంటే కూడా మంచి ఫలితాలు వస్తాయని పండితులు తెలిపారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!