Advertisement
పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా కే జి ఎఫ్-2 మొదటి పార్ట్ కంటే భారీ యాక్షన్ సీన్స్ తో అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ మూవీ రచ్చ చేసింది. ఈ సినిమాలో హీరో యాక్టింగ్ ఒకెత్తయితే సినిమా లో ఉండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడికి గూస్ బంప్స్ తెప్పించిందని చెప్పవచ్చు. మరి అంతటి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా అని ఆరా తీస్తున్నారు ప్రేక్షకులు. దీంతో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. రవి బస్రూర్ కే జి ఎఫ్ మూవీ రాకముందు నార్మల్ మ్యూజిక్ డైరెక్టర్.
Advertisement
ALSO READ: వన్డే క్రికెట్ లో 10 ఓవర్లు వేసి ఎక్కువ రన్స్ ఇచ్చిన బౌలర్లు వీరే!
కేవలం కన్నడం వరకు మాత్రమే తెలుసు.2018 కేజిఎఫ్ మొదటి భాగం రాగానే దేశం మొత్తం షేక్ అయిపోయింది. డైరెక్టర్ హీరో తో పాటుగా మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఓవర్ నైట్ లోనే సెన్సేషనల్ గా మారారు. సినిమాలోని సాంగ్స్ బీజీఎం ఓ లెవెల్ లో ఉండే సరికి మూవీ లవర్స్ కోసం రిపీట్ షో లు వేసారు. అలాంటి రవి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే గుణంతో లాక్ డౌన్ సమయంలో తన సొంత ఊరు అయినా కుందాపూర్ కి వెళ్లి, తన తండ్రితో పాటు దేవుళ్లకు ఆభరణాలు చేసే పనిలో సాయం చేశాడు. తన తండ్రికి సాయం చేసి రోజుకు ముప్పై ఐదు రూపాయల సంపాదన అందుకునేవారు.
Advertisement
మ్యూజిక్ డైరెక్టర్ గా కోట్ల రూపాయలు తీసుకునే రవి తండ్రికి సాయపడుతూ 35 రూపాయలు తీసుకోవడం లోనే తన ఆనందాన్ని వెతుక్కున్నాడు. అంతకుముందు ఆయన కార్పెంటర్, పెయింటింగ్ లాంటి చిన్న చిన్న పనులు చేసేవారట. ఇతని లో ఉండే టాలెంట్ గుర్తించిన ప్రశాంత్ నీల్ తన మొదటి సినిమా ఉగ్రం కి మ్యూజిక్ డైరెక్టర్ గా చేసే అవకాశం ఇచ్చారట. ఇక ఆ తర్వాత కే జి ఎఫ్ సినిమా కి మ్యూజిక్ అందించి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఎంత ఎదిగినా తన మూలాలు మాత్రం మర్చిపోని రవి బస్రూర్ ని చూసి ఆడియన్స్ అంతా శభాష్ అంటున్నారు.
ALSO READ: