Advertisement
రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు హాట్ టాపిక్ మన్నెగూడలో యువతి కిడ్నాప్ ఘటన. ఈ సంఘటన లో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మన్నెగూడలో మొన్న శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులపై దాడి చేసి, ఇంటిని ధ్వంసం చేసి యువతిని కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మన్నెగూడ శుక్రవారం ఉదయం సినీ ఫక్కీలో కిడ్నాప్ కు గురైన యువతి కథ సుఖాంతమైనట్లు తెలుస్తోంది. తాను క్షేమంగా ఉన్నట్లు తండ్రి దామోదర్ రెడ్డికి ఆమె ఫోన్ ద్వారా తెలిపింది.
Advertisement
దీంతో ఇప్పటికే కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు, యువతి ఫోన్ చేసిన సెల్ టవర్ లోకేషన్ ఆధారంగా నల్గొండ లో ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు నల్గొండ పోలీసులను రాచకొండ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె ను పోలీసులు గుర్తించి స్టేషన్ కు తీసుకెళ్లారు. యువతీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్న రాచకొండ ఏసీబీ సుధీర్ బాబు ఆమెను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
Advertisement
ఈ సమయంలో అన్ని వివరాలు చెబితే కేసు దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందన్నారు. కాగా యువతని అపహరిస్తున్న సమయంలో వెంబడించిన పోలీసులు ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులోనే నిందితుల వాహనాన్ని అడ్డుకొని, నవీన్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి, మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, యువతిని మాత్రం కాపాడినట్లు పోలీసులు చెప్పారు. యువతీ తన తండ్రికి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నానని పోలీస్ స్టేషన్ నుంచే చెప్పినట్లు తెలిసింది. అంతే కాదు నవీన్ రెడ్డినే తనను కిడ్నాప్ చేసినట్లు పేర్కొంది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: ఎంత ప్రేమ ఉంటే అలా చేస్తారు.. చనిపోయిన భార్యను మళ్ళీ అలా..!!