Advertisement
పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు మనం ఏం మాట్లాడితే అది మాట్లాడతారు. మనం ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటారు. పిల్లలకి ఎక్కువ జ్ఞాపకశక్తి ఉంటుంది. అలానే పిల్లలకి ఎక్కువ ఏదైనా విషయాన్ని నేర్చుకునే శక్తి ఉంటుంది. ఐదేళ్ల లోపు పిల్లలకు ఈ ఐదు విషయాలని కచ్చితంగా తల్లిదండ్రులు నేర్పాలి. పిల్లలకు ఈ ఐదు విషయాలు నేర్పిస్తే ఇక చూసుకోక్కర్లేదు. చిన్నతనం నుండే గౌరవ భావాన్ని నేర్పించాలి. ఎంత కోపం లో ఉన్నా కూడా ఇతరులను అవమానించి మాట్లాడకూడదని వాళ్ళకి నేర్పాలి. అలాగే పిల్లలు తాము చేసిన తప్పుల నుండి తప్పించుకోకుండా దాచిపెట్టకుండా ఒప్పుకునేలా వాళ్లకి అలవాటు చేయాలి.
Advertisement
Advertisement
అదే విధంగా దుఃఖం, బాధ, కోపం, సంతోషం మొదలైన భావోద్వేగాలను వ్యక్తం చేసే విధంగా పిల్లలకు నేర్పించాలి. పరిస్థితులకి అనుకూలంగా సారీ, థాంక్స్ వంటివి చెప్పడం వాళ్లకి నేర్పించాలి. ఎవరినైనా క్షమించే తత్వాన్ని వాళ్ళకి అలవాటు చేయాలి. అంతేకాకుండా ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం కోసం వాళ్లే ఆలోచించే విధంగా చూడాలి.
Also read:
Also read:
పిల్లలకు భవిష్యత్తుని అందంగా మార్చే విధంగా వాళ్ళని మనిషి వ్యక్తుల్లా తయారు చేసే అలవాట్లను వాళ్ళకి నేర్పాలి. ఇలా వీటిని గనక తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తే పిల్లలు జీవితాంతం హాయిగా సంతోషంగా ఉంటారు. ఎక్కడున్నా ఏ బాధ లేకుండా ఉంటారు. నలుగురిలో కలిసి హాయిగా ఉంటారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!