Advertisement
కిరణ్ అబ్బవరం క సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. భారీ అంచనాల నడుమ దీపావళి పండుగకు ఈ సినిమా రిలీజ్ అయింది. మంచి సక్సెస్ ని అందుకుంది. కలెక్షన్స్ కూడా బానే వచ్చాయి. కిరణ్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పైగా దీపావళి కంటే ముందు చాలా మూవీస్ నటించినా సక్సెస్ సాధించలేకపోయాయి. క మూవీ సక్సెస్ ని సాధించడంతో భారీ కలెక్షన్స్ వస్తుంది.
Advertisement
ఈ సక్సెస్ టైం లో కిరణ్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఆయనకు పెద్ద సపోర్ట్ ని ఇస్తున్నాయి. రిపోర్టర్ ప్రశ్నిస్తూ మీరు ఏ హీరోకి ఫ్యాన్ అని అడిగారు. కిరణ్ ఏమాత్రం ఆలోచించలేదు. పవన్ కళ్యాణ్ అభిమానిని అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
Also read:
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయనకు పాజిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. పవన్ ని కిరణ్ ఆచరిస్తున్నట్లు ఇప్పటిదాకా ఆయన మాట్లాడుతున్న వాటిని పోస్ట్ చేస్తున్నారు. ఇంకొంత మంది పవన్ ఫ్యాన్స్ అయినట్లయితే పవనిజం అనేది కిరణ్లో స్పష్టంగా కనపడుతోందని అంటున్నారు. కిరణ్ కి బానే సపోర్ట్ చేస్తున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!