Advertisement
ప్రస్తుతం పెళ్లికి ముందే డేటింగ్ అనే ట్రెండ్ నడుస్తోంది. పెళ్లికి ముందు రిలేషన్ షిప్ లో ఉంటున్నారు చాలామంది. తాజాగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ విషయం కూడా చర్చనీయాంశమైంది. రిలేషన్ షిప్ ఎంత బాగుంటుందో అంత ఇబ్బంది పెడుతుంది. మానసికంగా, శారీరకంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే రిలేషన్ షిప్ లోకి దిగేముందు చాలా ఆలోచించాలి. జీవిత భాగస్వామి అన్వేషణలో మీరు తీసుకున్న ఒక్క నిర్ణయం మీ జీవితమంతా దుఃఖానికి కారణం కావచ్చు. అందుకే ముందు ఎదుటివారి గురించి బాగా తెలుసుకోవాలి. ముఖ్యంగా రిలేషన్ షిప్ లోకి ప్రవేశించే ముందే ఈ 5 విషయాలను గుర్తుంచుకోవాలి.
Advertisement
Read also: బిందెతో ఫోజులిస్తున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
1) నియంత్రణ.
కొంతమంది తమ జీవిత భాగస్వామి పట్ల చాలా పాజిటివ్ గా ఉంటారు. భాగస్వామి ఏ పని చేసినా అందులో జోక్యం చేసుకుంటారు. వారిని ఎప్పుడూ నియంత్రణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎల్లప్పుడూ అనుమానాస్పదంగా లేదా మీపై నిగా ఉంచే వ్యక్తి ఎప్పుడూ మంచి భాగస్వామి కాదు. ఓవర్ గా ఎక్స్పోజ్ అయ్యి ఇబ్బందులు పెడుతుంటారు. ఏమి ధరించాలి, ఏమి ధరించకూడదు, ఏమి చేయాలి, ఏం తినాలి అనేది కూడా వారే నిర్ణయిస్తారు. ఇలా మీ నిర్ణయాలని ఎవరు ఎదుటివారు కంట్రోల్ చేయాలని చూస్తుంటే జాగ్రత్తపడాలి.
2) అబద్ధాలు చెప్పడం.
Advertisement
రిలేషన్ షిప్ లో జీవిత భాగస్వామికి అబద్ధాలు చెప్పడం అనేది చాలా తప్పు. నిజాలను దాచడం లేదా ఎప్పుడూ అబద్ధాలను ఆశ్రయించే భాగస్వామి మిమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచలేరు. అలాంటి వారికి దూరంగా ఉండాలని, అలాంటి వారిని జీవిత భాగస్వామిని చేసుకుంటే సుఖ జీవనం ఉండదని అంటున్నారు.
3) నీచులకు దూరంగా ఉండడం.
తనతో పాటు మీ ఆసక్తి, కెరీర్, అభిరుచి మొదలైన వాటిని జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి మంచి భాగస్వామి. అలాకాకుండా తనకోసం మాత్రమే ఉండి ఎవరి ఇష్ట ఇష్టాలను కూడా పట్టించుకోకుండా వారి పరిధి వరకు మాత్రమే చూసుకునే వారికి దూరంగా ఉండాలంటున్నారు.
4) కట్టుబడి ఉండడం.
చాలామంది నిబద్ధత విషయంలో సీరియస్ గా ఉండరు. అది ఏ విషయంలోనైనా కావచ్చు. ఇప్పటినుండి భవిష్యత్తు గురించి ఏమీ ఆలోచించాలి?, భవిష్యత్తు గురించి ఆలోచించి వర్తమానాన్ని ఎందుకు పాడు చేయాలి అనే వారి నుండి దూరంగా ఉండడం మంచిదంటున్నారు. భవిష్యత్తు గురించి ఆలోచించని వ్యక్తి బంధానికి సరికాదు.
5) మద్దతు లేని.
మీ మంచి, చెడు సమయాల్లో మీతో పాటు ఉండే వ్యక్తి నిజమైన భాగస్వామి. తమ భాగస్వామికి అవసరమైన సమయంలో ఫోన్ చేయకపోవడం కానీ, అవసరం వచ్చినప్పుడు అండగా ఉండకపోవడం కానీ చాలామందిలో కనిపిస్తున్నాయి. కారణం అడిగితే సాకు చెబుతారు. అలాంటి వ్యక్తులు సంబంధాలకు మంచిది కాదు.
Read also: అపరిచితుడు సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా..?