Advertisement
మాజీ మంత్రి కొడాలి నాని వైసీపి ఐదేళ్ల పాలనలో చంద్రబాబు పై ఎన్నో మాటలు అనేవాడు. అయితే చంద్రబాబు గురించి వ్యక్తిగత జీవితం పై కూడా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి అని చెప్పవచ్చు. ఇప్పుడు వైసీపీకి ఓటమి ఎదురైన తర్వాత కొడాలి నాని సైలెంట్ అవ్వడం జరిగింది. కాకపోతే తిరుమల లడ్డు వ్యవహారంలో కూటమి ప్రభుత్వం వైసీపీ ను నిందించడంతో తిరిగి చంద్రబాబు తీరు పై మరొకసారి విరుచుకుపడ్డాడు. చంద్రబాబు రాజకీయాల కోసమే దేవుడి ప్రసాదం గురించి ఇలా చేశారని, స్వార్థం కోసం ఎంత దూరమైనా వెళ్తారని ఆరోపించారు. ఒకవేళ చంద్రబాబు శ్రీవారి భక్తుడు అయితే ఎన్ని సార్లు గుండు గీయించుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ప్రతి సంవత్సరం తిరుమల కు వెళ్తానని గుండు చేయించుకుని, తలనీలాలు సమర్పించుకుంటానని చెప్పారు.
Advertisement
Advertisement
ఈ విధంగా నాని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. లడ్డు తయారు కి సంబంధించి నూనె విషయంలో ఎన్నో నిబంధనలు ఉన్న విషయాన్ని కొడాలి నాని ప్రస్తావించడం జరిగింది. క్వాలిటీ కంట్రోల్ అనుమతి ఇచ్చాకనే టాంకర్లు తిరుమలకు వస్తాయని ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవని ఏ ల్యాబ్ కూడా ఇంతవరకు నిర్ధారించలేదని ఇది ఒక అనుమానం మాత్రమే అని వ్యక్తం చేశారు. కాకపోతే చంద్రబాబు రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామిని తీసుకువచ్చి మరింత సమస్యగా చూపిస్తున్నారని కొడాలి నాని చెబుతున్నారు.
Also read:
కొడాలి నాని ఎన్నో నెలల నుండి చాలా సైలెంట్ గా ఉన్నారు. అయితే ఇటీవల విజయవాడలో జరిగిన వరదల పై కూడా ఏ విధంగా స్పందించలేదు. గత ఐదేళ్లుగా కొడాలి నాని అనుచరుల చేతిలో ఉన్న భూములను సైతం ఇటీవల వెనక్కి లాక్కుని యజమానులకు అప్పగించారు, దీనిపై కూడా ఏ విధంగా కొడాలి నాని స్పందించలేదు. ఇప్పుడు తిరుమలలో లడ్డు వివాదంలో వైసీపి ప్రభుత్వం ను కార్నర్ చేయడంతో తాజాగా కొడాలి నాని స్పందించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!