Advertisement
టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 159 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీం ఇండియా టార్గెట్ ను చేరుకుంది. మ్యాచ్ ఆద్యంతం నరాలు తెగే ఉత్కంఠంగా కొనసాగింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Advertisement
మెల్బోర్న్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేసి టీం ఇండియాకు విజయాన్ని అందించాడు. ఇది కాకుండా, హార్దిక్ పాండ్యా 37 బంతుల్లో 40 పరుగుల ముఖ్యమైన సహకారం అందించాడు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాల అద్భుతమైన భాగస్వామ్యంతో టీమ్ ఇండియా చివరి బంతికి పాకిస్తాన్ ను ఓడించగలిగింది. అలాగే, పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన పేరిట ఓ భారీ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డపై టి20, వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో విరాట్ కోహ్లీ 500 కు పైగా పరుగులు చేశాడు.
Advertisement
మూడు ఫార్మాట్లలో ఇలా చేసిన ఏకైక క్రికెటర్ భారత మాజీ కెప్టెన్ కావడం గమనార్హం. ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఘనత సాధించిన ఏకైక విదేశీ ఆటగాడు విరాట్ కోహ్లీ. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో విరాట్ కోహ్లీ 1352 పరుగులు చేశాడు. వన్డే ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ పేరిట 1327 పరుగులు నమోదయ్యాయి. అదే సమయంలో టి20 ఫార్మాట్ లో కూడా విరాట్ కోహ్లీ బ్యాట్ దూకుడు చూపించింది. ఈ ఆటగాడు ఆస్ట్రేలియా గడ్డపై టీ 20 ఫార్మాట్ లో 533 పరుగులు చేశాడు. కాగా, భారత జట్టు టి20 ప్రపంచ కప్ 2022లో తన రెండవ మ్యాచ్ ను నెదర్లాండ్స్ తో తలపడనుంది. అక్టోబర్ 27న సిడ్నీలో భారత్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభం అవుతుంది.
READ ALSO : T20 WC 2022: నెదర్లాండ్స్ తో మ్యాచ్ కి టీమిండియా ఆల్ రౌండర్ ఔట్.. కారణం ఏంటంటే?