Advertisement
ఎవరైనా ఒక దారిలో నడవాలంటే.. వారికి చూపు ఉంటే చాలు ! కానీ పది మంది ఓ దారిలో నడవాలంటే.. పైగా.. ఆ దారి.. వాళ్లు క్షేమంగా నడిచేలా ఉండాలంటే మాత్రం… ముందుచూపు కావాలి.. అది కూడా అక్కడి నాయకుడికి. పేరుకు ఇది ఓ సినిమాలో ఫేమస్ డైలాగే అయినా.. అక్షరాలా నిజం. అలాంటి ఓ దారి ఉన్న ఊరు నల్లగొండ అయితే.. తన జనం కోసం ముందుచూపున్న ఆ నాయకుడు మాత్రం.. (కేవీఆర్) యస్.. మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు..
Advertisement
(నల్గొండ క్లీన్ రోడ్స్, ఫ్లై ఓవర్, కె.వి.ఆర్ విజ్) అయితే.. ఇదంతా అందమైన వర్తమానం. మరి..గతం… పీడకల లాంటి భయంకర నిజం ( గతంలోని రోడ్లు,డ్రైనేజీలు, పందులు) ఏదో చేస్తారని ఓటు వేసి ఎన్నుకున్న ఏలికలు..నల్లగొండ జనానికి ఇచ్చిన బహుమానం.(ఛండాలమైన రోడ్లు, పందుల విహారం, యాక్సిడెంట్ బాధితులు వగైరా విజ్) చూశారుగా… గతుకుల రోడ్లు, ట్రాఫిక్ జామ్ లు, రైల్వే క్రాసింగ్ ప్రాంతంలో నిత్యం యాక్సిడెంట్లు.. ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాలు… ఇదే ఇరవై ఏళ్ల క్రితం నల్గొండ పట్టణంలోని భయానక దృశ్యం. పట్టించుకునే అధికారి లేడు.. ఏ పాలకుడూ రాడు. కానీ.. తన జనానికి ఎక్కడ ఏ కష్టమొచ్చినా..అన్నా అనగానే నేనున్నా అంటూ వచ్చే వెంకన్న ఉన్నాడుగా..
Advertisement
ప్రభుత్వం వద్దనుకుంటే.. మన వెంకన్న మనసు ఊరుకోదుగా.. పదవిలో ఉన్నా.. లేకున్నా.. ప్రజల గుండెల్లో నిరంతరం వుండే కోమటిరెడ్డికి ఒకరు చెప్పక్కర్లేదు..తాను ఎంతగానో ప్రేమించే నల్లగొండ.. నరకంలా ఉండటం.. మన వెంకన్న గుండెల్లో గునపంలా గుచ్చుకుంది.. అంతే .. కార్యాచరణ సిద్ధమైంది.. కోమటిరెడ్డి చొరవతో.. అద్భుతమైన ఫ్లైవోవర్ సాకారమైంది. వెంకన్న దంపతుల తీరని కడుపుకోత నుంచి ఆవిర్భవించిన ప్రతీక్ ఫౌండేషన్.. నల్లగొండ బిడ్డల పాలిట వరంలా మారింది.. ప్రతి అవసరానికీ తల్లిలా ఆదుకుంటూనే ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. నల్లగొండ రూపమే మారిపోయింది.
(ఎం.జీ.యూనివర్శిటీ, పేదల ఇండ్లు, సీసీ రోడ్లు వగైరా) చూస్తున్నారుగా.. నల్లగొండ వాసికి ప్రపంచస్థాయి విద్యనందించే మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, ఇంకా పేదవారికి ఇండ్లు, అద్భుతమైన సీసీ రోడ్లు.. తాగునీరు… ఇలా ఒక్కటేమిటి..! ప్రతీక్ ఫౌండేషన్ పుణ్యమా అని నల్లగొండ కొత్తరూపాన్ని సంతరించుకుంది. దయచేసి.. ఒక్కసారి ఆలోచిద్దాం..