Advertisement
ప్రజానాయకుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఎవరంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని చెబుతున్నారు నియోజకవర్గ ప్రజలు. ఎవరు కష్టంలో ఉన్నా ఆయన క్షణం ఆలోచించరని.. సొంత డబ్బులను ప్రజా శ్రేయస్సు కోసం వెచ్చిస్తారని అంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది పేద విద్యార్థులకు అండగా నిలిచిన ఆయన.. కష్టాల్లో ఉన్న ఎన్నో కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారని వివరిస్తున్నారు. తాజాగా మరో కుటుంబానికి బాసటగా నిలిచారని చెబుతున్నారు.
Advertisement
Advertisement
నల్గొండ జిల్లా కనగల్ మండలానికి చెందిన గుండబోయిన రవీందర్ లోగ్రేడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. అతని కుటుంబ పరిస్థితి తెలిసి.. ఆస్పత్రి ఖర్చులు అధికం అవుతున్నాయని.. వెంకట్ రెడ్డి కోఠిలోని కామినేని ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి రవీందర్ కు ఆపరేషన్ చేయించారు. అంతేకాదు, తన PA సైదులును ఆస్పత్రికి పంపి.. ప్రస్తుత అవసరాల కోసం రూ.50 వేల సాయం చేశారు వెంకట్ రెడ్డి.
రవీందర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు ఆయన. అలాగే, కుటుంబసభ్యులతో ఫోన్ లో మాట్లాడి.. రవీందర్ పూర్తిగా కోలుకునేదాకా అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డిని అభినవ దానకర్ణుడిలా, మంచి మనస్సు గల మహా నాయకుడిగా కొనియాడుతున్నారు నియోజకవర్గ ప్రజలు.
సోషల్ మీడియాలో అయితే.. కోమటిరెడ్డి.. ఐదక్షరాలు పదం కాదు.. వెలకట్టలేని నమ్మకం… ఇది పేరు కాదు.. లక్షలమంది ఆరాధించే గుండెచప్పుడు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.