Advertisement
కోమటిరెడ్డి సహాయ గుణం, మంచి మనస్సు గురించి ఎంత చెప్పినా తక్కువేనని అంటున్నారు భువనగిరి నియోజకవర్గ ప్రజలు. పేదలకు సాయమంటే ఆయన క్షణం కూడా ఆలోచించరని చెబుతున్నారు. ఎప్పుడూ ఏదో ఒక కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడుతూ ఉంటారని అంటున్నారు.
Advertisement
తాజాగా భువనగిరిలోని 11వ వార్డు బొమ్మయిపల్లికి చెందిన నిరుపేద దళిత కుటుంబానికి అండగా నిలబడ్డారు కోమటిరెడ్డి. కొంపెల్లి శివ(19) అనే యువకుడు.. బైపాస్ రోడ్డులో కారు ప్రమాదాన్ని గురికాగా.. హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతూ చనిపోయాడు. అతని కుటుంబ పరిస్థితి అంతంతమాత్రమే. ఈ విషయం తెలిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండగా నిలబడ్డారు.
Advertisement
శివ కుటుంబానికి 25 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు వెంకట్ రెడ్డి. తాను ఢిల్లీలో ఉండడం వల్ల తర్వాత పరామర్శించడానికి వస్తానని చెప్పారు. మృతుడి చెల్లెలు పదో తరగతి చదువుతోందని తెలిసి.. ఆమె పై చదువులకు అయ్యే ఖర్చు అంతా భరిస్తానని చెప్పారు. కోమటిరెడ్డి దయాగుణాన్ని చూసి నియోజకవర్గ ప్రజలు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.
సాయంలో దానకర్ణుడు.. మానవత్వంలో రాముడు.. సముద్రమంత అభిమానం ఉన్న మహా నాయకుడు.. అంటూ కోమటిరెడ్డిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం కూడా నల్గొండ జిల్లా కనగల్ మండలానికి చెందిన గుండబోయిన రవీందర్ లోగ్రేడ్ క్యాన్సర్ తో బాధపడుతుంటే.. కోఠిలోని కామినేని ఆస్పత్రిలో చేర్పించి కోమటిరెడ్డి ఆపరేషన్ చేయించారు. రవీందర్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే, అతని కుటుంబసభ్యులతో ఫోన్ లో మాట్లాడి.. ప్రస్తుత అవసరాల కోసం తన PA సైదులును పంపి రూ.50 వేల సాయం అందించారు.