Advertisement
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం నిత్యం పని చేస్తూ ఉంటారు. అయితే తాజాగా… ప్రభుత్వ అవసరాల కోసం భూమిని కోల్పోయిన రైతుల పక్షాన దీక్షకు దిగేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు మొన్న మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను కలిసి భూ నిర్వాసితుల పక్షాన ఓ వినతి పత్రాన్ని అందజేసిన అనంతరం ఆయన కీలక ప్రకటన చేశారు.
Advertisement
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలం బండ రావిరాల, చిన్న రావిరాల పరిధిలో భూమిని కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలన్న డిమాండ్ తో 72 గంటల దీక్షకు దిగనున్నట్లు వెంకట్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ దీక్షపై తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొన్ని అనివార్య కారణాలవల్ల తాను దీక్షకు దిగలేకపోతున్నానని పేర్కొన్నారు.
Advertisement
బండ రావిరాల, చిన్న రావిరాల పరిధిలో భూమిని కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలన్న డిమాండ్ తో … దసరా తర్వాత దీక్షకు దిగుతానని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. గత ఏడు సంవత్సరాలుగా ఇక్కడి రైతులకు పరిహారం చెల్లించకుండా కేసీఆర్ ప్రభుత్వం… ఆటలు ఆడుతుందని మండిపడ్డారు. భూ నిర్వాసితులకు ప్రస్తుతం ల్యాండ్ వాల్యూ ఎంత ఉందో.. అంతే కట్టివ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆ ల్యాండ్ విలువ ఎకరా 12 లక్షలు పలుకుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యాల్యూ ప్రకారమే రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిర్వాసితుల్లో 209 మంది రైతులు ఉన్నారని… కానీ ఈ ప్రభుత్వం 59 మంది మాత్రమే ఉన్నట్లు తప్పుడు లెక్కలు చూపిస్తుందని నిప్పులు చెరిగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిర్వాసితుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా తాను దసరా తర్వాత దీక్ష చేస్తానని ప్రకటన చేశారు.
Read also : రైల్వే ట్రాక్‌లపై కంకరాళ్లను ఎందుకు వేస్తారు.. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి ?