Advertisement
తెలంగాణలో ఎక్కడ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా.. నేనున్నానంటూ ముందుకు వస్తుంది కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్. చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే వేల మంది విద్యార్థులకు ఆర్థిక సాయం, వసతుల కల్పన చేసింది ఈ ఫౌండేషన్. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ, సికింద్రాబాద్ పీజీ కాలేజీలో విద్యార్థులకు 150 రీడింగ్ చైర్స్ అందజేసింది. అంతేకాదు, తాగునీటికి సంబంధించి 3 ఆర్వో ప్లాంట్స్, 3 వాటర్ కూలర్స్ ను సమకూర్చింది.
Advertisement
ప్రతీక్ ఫౌండేషన్ సీఈవో గోనారెడ్డి వీటిని కాలేజీకి డొనేట్ చేశారు. అలాగే, గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్స్ ను కూడా అందజేస్తామని చెప్పారు. దేశంలో లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ పరిస్థితిని అందరూ గమనించాలని కోరారు. వారికి సరైన మౌలిక సౌకర్యాలు లేవని.. శాశ్వత ఫ్యాకల్టీ లేరని తెలిపారు. ల్యాబోరేటరీలు, లైబ్రరీలల్లో సరైన సదుపాయాలు సమకూర్చేందుకు కాలేజీల దగ్గర నిధులు ఉండడం లేదన్నారు. ప్రభుత్వం కాస్తో కూస్తో ప్రయత్నిస్తోందని.. కానీ, వారి పరిమితులు వారికి ఉన్నాయని చెప్పారు.
Advertisement
సుమారు రెండు కోట్ల మంది విద్యార్థులు పాఠశాలలకు దూరమౌతున్నారని.. ఎంతోమంది డ్రాపౌట్లుగా మిగిలిపోతున్నారని వివరించారు గోనారెడ్డి. విద్యా రంగానికి తక్కువ ప్రాధాన్యత లభిస్తోందన్న ఆయన.. ఈ క్రమంలోనే స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు, కొందరు ముందుకు వస్తున్నారని తెలిపారు. మీరంతా అదృష్ట వంతులని.. ఈ దేశ భవిష్యత్ మీ భుజాలపై ఉందని విద్యార్థులకు సూచించారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేందుకే కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ముందుకొచ్చిందని తెలిపారు.
పీజీ కళాశాల ప్రిన్సిపాల్ అర్జున్ రావు మాట్లాడుతూ.. ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అడిగిన వెంటనే తమకు ఇంత సాయం చేశారని కొనియాడారు. ఫౌండేషన్ సీఈవో గోనారెడ్డి, ఎంపీ PA సైదులు, మిత్రులు రమేష్ రెడ్డి పీజీ కళాశాలకు విచ్చేసి 150 చైర్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇవే కాకుండా స్టడీ మెటీరియల్స్ కూడా ఇస్తామని చెప్పినందుకు వెంకట్ రెడ్డికి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తరఫున థ్యాంక్స్ చెప్పారు.