Advertisement
తెలంగాణలో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. గెలుపు కోసం శరవేగంగా పావులు కదుపుతున్నాయి. రోజురోజుకు తమ బలం పెంచుకునేందుకు తహతలాడుతున్నాయి. నాయకులతోపాటు కార్యకర్తలను తమ వైపు తిప్పుకునే కసరత్తు చేస్తున్నాయి. పనిలో పనిగా పక్క పార్టీలోని కీలక నేతల కోసం గాలం వేస్తున్నాయి. ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ నుంచి బూర నర్సయ్య గౌడ్ బిజెపి పార్టీలోకి వెళ్ళగా… బిజెపి నుంచి మరో ఇద్దరికి కీలక నేతలు టీఆర్ఎస్ లో చేరారు.
Advertisement
దాసోజు శ్రవణ్ మరియు ఉద్యమ నాయకుడు స్వామి గౌడ్ టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అంతేకాదు బిజెపి పార్టీపై విమర్శలు చేస్తూ టిఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమకారులకు బిజెపి పార్టీలో స్థానం లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే… టిఆర్ఎస్ పార్టీకి కౌంటర్ గా కొండా విశ్వేశ్వర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి భారీ చేరికలు ఉంటాయంటూ బాంబు పేల్చారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి తులా ఉమాలు టిఆర్ఎస్ పార్టీకి పోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.
Advertisement
మునుగోడులో బిజెపి గెలుపు దిశగా పయనిస్తున్న నేపథ్యంలో ఉద్యమకారులపై తప్పుడు ప్రచారం జరిగేలాగా కుట్ర పొందుతున్నారని ఫైర్ అయ్యారు. బిజెపి గెలుపు కోసం కొండ విశ్వేశ్వర్ రెడ్డి జితేందర్ రెడ్డి తో పాటు నేను పది రోజుల్లో ఇక్కడే పనిచేస్తున్నానని పేర్కొన్నారు. మాకు ఎలాంటి ఫోన్ రాలేదు మాకు ఫోన్ వచ్చిన మేము వాటికి రెస్పాండ్ అవ్వడం ప్రలోభాలకు లొంగేవాళ్ళం కాదని వివరించారు. త్వరలో బిజెపిలో చేరే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది నలుగురు మాజీ ఎంపీలు ఇద్దరు మంత్రులు ఒకరు మంత్రి కొడుకు ఒకరు మంత్రి అల్లుడు బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధం కావడంతో కేసీఆర్ ఈ చేరికల కుట్ర చేస్తున్నాడని అగ్రహించారు. తండ్రి, కొడుకులు ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో బిజెపి గెలుపును ఆపలేరు తెలంగాణలో బిజెపి బలోపేతాన్ని అడ్డుకోలేరన్నారు చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి.
read also : తమ్ముడి దెబ్బకు..రాజకీయాలకు గుడ్ బై ?