Advertisement
Konidela NIharika Divorce:మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా మెగా డాటర్ అంటూనే తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ని కూడా సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావాలని ఎంతో ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే మొదట యాంకర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టింది నిహారిక. ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. కానీ ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. ఆ తర్వాత ఇంట్లో పెద్దలు చెప్పిన పెళ్లి చేసుకుంది. 2020లో జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది. వీరి పెళ్లిని నాగబాబు ఎంత వైభవంగా చేశారో ఇప్పటికీ మర్చిపోలేరు. అయితే పెళ్లై మూడేళ్లు కూడా గడవకముందే వీరి వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడ్డాయి అంటూ వార్తలు వస్తున్నాయి.
Advertisement
Read also: TOLLYWOOD TELUGU MOVIES: పాత సినిమా టైటిల్స్ తో ఇప్పటి దాకా వచ్చిన వచ్చిన 10 టాలీవుడ్ మూవీస్ !
Advertisement
సోషల్ మీడియాలో నిహారిక, చైతన్యలు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో పాటు.. చైతన్య పెళ్లి ఫోటోలు అన్నీ డిలీట్ చేశాడు. దీంతో చైతన్య, నిహారిక విడాకుల వార్తలకు ఆజ్యం పోసినట్టయింది. అయితే నిహారికను పెళ్లి చేసుకోవడానికంటే ముందే చైతన్య ఆమెకి ఓ కండిషన్ పెట్టాడంట. పెళ్లి తర్వాత సినిమాలలో నటించకూడదని కండిషన్ తో పెళ్లి చేసుకున్నాడట. కానీ నిహారిక, చైతన్య కండిషన్ ను పక్కనపెట్టి ఒక వెబ్ సిరీస్ లో కీలకపాత్రలో కనిపించింది. ఇది నచ్చకపోవడంతో చైతన్య విడాకులు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ విడాకుల వార్తలపై నిహారిక, చైతన్య ఇంతవరకు స్పందించలేదు.. అలాగే ఖండించనూ లేదు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి. విడాకుల వార్తల నేపద్యంలో నిహారిక తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఓ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రోమోని షేర్ చేసింది. “డెడ్ పిక్సెల్స్” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును స్వయంగా నిహారిక నిర్మించడమే కాకుండా నటించిందట. ఈ వెబ్ సిరీస్ లో నిహారిక మెయిన్ లీడ్ లో యాక్ట్ చేస్తూ కనిపించబోతుంది. ఈ సిరీస్ లో నిహారిక, వైవా హర్ష తదితరులు ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయనున్నట్లు ఆమె పేర్కొంది.
Read also: VENU SWAMY WIFE NAME: వేణు స్వామి భార్య ఎవరు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?