Advertisement
రాజమౌళి తర్వాత అంతటి స్టార్ ఇమేజ్ కలిగిన దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది కొరటాల శివ అనే చెప్పాలి. బీటెక్ పూర్తి చేసిన కొరటాల శివ 1998లో ఉద్యోగం చేసుకుంటూ తనకి బావ వరుసైన పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరారు. ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, ఊసరవెల్లి వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశాడు. ఆ తర్వాత 2013లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారారు. మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ వంటి చిత్రాలు తెరకెక్కించి బ్లాక్ బస్టర్లు అందుకొని స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు కొరటాల శివ.
Advertisement
Read also: టి20 ప్రపంచ కప్ లో టీమిండియా రికార్డులు!
తన సినిమాలతో హిట్లు కొట్టడం మాత్రమే కాదు.. అందులో ఏదో ఒక సామాజిక అంశాన్ని టచ్ చేసి ప్రేక్షకులకు మంచి మెసేజ్ ని కూడా ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం కొరటాల ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే కొరటాల శివ మంచి వ్యక్తిత్వానికి, అలాగే ఆయన సక్సెస్ ల వెనక ఉన్నది అతని భార్య అని ఎన్నో సందర్భాలలో కొరటాల శివ చెప్పారు. కొరటాల శివ భార్య అరవింద చాలా సింపుల్ గా ఉంటారు. ఆమె లండన్ లో ఉన్నత విద్య చదువుకున్నారు. కొరటాల శివ సింప్లిసిటీ చూసి అరవింద ఆయనను ప్రేమించి వివాహం చేసుకున్నారట. ఇక వీరికి పెళ్లి చేసుకుని ఇంతకాలం అయినా ఇప్పటికీ పిల్లలు మాత్రం లేరు. ఈ విషయం గురించి కొరటాల పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు.
Advertisement
అయితే సమాజంలో గల చిన్నవాళ్లంతా తమ పిల్లలనే భావన గల ఆమె అదే దిశగా కొరటాలను కూడా ప్రోత్సహించింది. ఇద్దరూ బ్రతకాలంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఉంటే సరిపోతుందని అరవింద ఎక్కువగా భావిస్తారట. అంతేకాకుండా ఈమె రామకృష్ణ పరమహంస భక్తురాలు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా హైదరాబాదులోని రామకృష్ణ మఠం కు వెళ్లి అక్కడున్న వారికి ఎంతో సేవ చేస్తుందట. కొరటాల శివ – మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సినిమా కథకు మూల కారణం కొరటాల భార్య అని సమాచారం. తాను ఎంత సంపాదించుకున్నా అవసరానికి మించి ఉండకూడదనే భావనతో అరవింద ఉంటుందట. అందుకే ఎన్ని కోట్లు సంపాదించినా నేటికీ చిన్న అపార్ట్మెంట్ లోనే ఉంటున్నారు ఈ దంపతులు. వీరి సంపాదనలోని అధిక భాగం సమాజసేవకే వినియోగిస్తు ఆత్మ తృప్తి పొందుతున్నారట. ఈమె ఎంత గొప్ప వ్యక్తో ఈ విషయాలను బట్టి చెప్పొచ్చు.
Read also: జపాన్‌లోనూ దుమ్ములేపుతున్న తెలుగు సినిమాలు ఇవే..అక్కడ కూడా మన హవానే