Advertisement
ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న అనుమానాల నేపథ్యంలో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు రాజకీయాలు హీటెక్కాయి. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తన ఫోన్ ట్యాప్ అవుతుందని ఆయన పెద్ద బాంబ్ పేల్చారు. దీంతో ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కోటంరెడ్డి వర్సెస్ వైసీపీ నేతలు అన్నట్టుగా యుద్ధం జరుగుతోంది.
Advertisement
తాను ఎంతగానో ఆరాదించే జగన్ ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందని ఆధారాలు చూపించి బయటకు వచ్చానన్నారు కోటంరెడ్డి. తన అరెస్టుకు రంగం సిద్ధమని లీకులు ఇస్తున్నారని.. శాశ్వతంగా జైల్లో పెట్టినా తాను సిద్ధమేనంటూ తేల్చిచెప్పారు. కేసులు పెట్టి మీరు అలసిపోవాలే తప్ప.. తన గొంతు ఆగే ప్రశ్నే లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు శ్రీధర్ రెడ్డి.
Advertisement
తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అధికారుల పని కాదని.. ప్రభుత్వ పెద్దల పనిగా చెప్పారాయన. నెల ముందు వరకు ఎలాంటి ఆలోచనలు లేవని.. ఫోన్ ట్యాపింగ్ పై ఆధారం దొరికాక దూరం జరిగాను అని తెలిపారు. విద్యార్థి నేతగా మొదలు 35 ఏళ్లుగా జిల్లా రాజకీయాల్లో ఉన్నానని.. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాదన్నారు. తన మనసు విరిగిపోయిందని చెప్పారు.
కోటంరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. పార్టీ మారాలనేది కోటంరెడ్డి వ్యక్తిగత విషయమని.. కానీ, తమ పార్టీపై బురద జల్లడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదని.. మ్యాన్ ట్యాపింగ్ అంటూ సెటైరియకల్ గా స్పందించారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కోటంరెడ్డి.. చంద్రబాబు ట్రాప్ లో పడ్డారని.. ఒకవేళ నిజంగా ట్యాపింగ్ జరిగి ఉంటే.. అవమానం, అనుమానం అనే బదులు విచారణకు ముందుకు వెళ్లొచ్చు కదా అని పేర్కొన్నారు.