Advertisement
తెలుగు ఇండస్ట్రీలో ఆ తరం హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేకమైన పేరుని సంపాదించుకున్న నటీమణులలో కె.ఆర్ విజయ ఒకరు. 1948 నవంబర్ 30వ తేదీన కేరళలో జన్మించారు కెఆర్ విజయ. విజయ తల్లి కళ్యాణి కేరళ రాష్ట్రానికి చెందినది కాగా.. తండ్రి రామచంద్రన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరుకు చెందినవారు. ఈమె బాల్యం చాలా మట్టుకు తమిళనాడులోని పళనీలో గడిచింది. అయితే విజయ బాల్యం నుండి రంగస్థలంపై నాట్య ప్రదర్శనలు చేసేది. ఈ కార్యక్రమాలను టీవీలో ప్రసారం చేసేవారు. అలా మద్రాసులో జరిగిన ఓ టీవీ కార్యక్రమాన్ని చూసిన నటుడు జెమినీ గణేషన్ ఆమె నటనకు ముగ్ధుడై సినీ తార అయ్యేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని ప్రోత్సహించాడు.
Advertisement
Read also: ఎవరూ చేయని త్యాగం చేస్తున్న ఇంద్రజ భర్త.. అదేంటో తెలుసా..?
కె ఎస్ గోపాలకృష్ణన్ దర్శకత్వం వహించిన “కర్పగం” అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది విజయ. ఈ చిత్రంలో జెమినీ గణేషన్ హీరోగా నటించారు. ఆ తర్వాత తన అందం, అభినయంతో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించింది. విజయ అమ్మవారి పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా దగ్గరయింది. అయితే ఇండస్ట్రీలో నటీనటులకు సంబంధించిన వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమైన విషయం. ఈ క్రమంలో కేఆర్ విజయ సోదరి, కూతుళ్లు కూడా వెండితెరపై నటిమలుగా స్థిరపడ్డారు. విజయ సోదరి సావిత్రి మాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే సావిత్రి ఇద్దరు కూతుర్లు అనూష, రాగ సుధా ఇద్దరు ఇండస్ట్రీలో నటీమణులుగా పేరు సంపాదించుకున్నారు.
Advertisement
అయితే విజయకు ఒక కూతురు ఉండగానే తన చెల్లెలు కూతురు అనూషను చేరదీసింది. విజయ కూతురిగా అనూష మాలీవుడ్ లోకి 13వ ఏటనే అడుగుపెట్టింది. తన అందచందాలతో, నటనాచాతుర్యంతో మలయాళంలో అనేక అవకాశాలు చేజిక్కించుకుంటూ.. సూపర్ హిట్ సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత తెలుగు సినీ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అదరించింది అనూష. రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన గోల్మాల్ గోవిందం సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. అయితే ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ స్థాయికి అనూష ఎదగలేక పోయింది. ఇక ప్రస్తుతం పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ.. సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Read also: అన్న రమేష్ బాబు కుటుంబానికి అండగా మహేష్ బాబు!