Advertisement
తెలుగు ఇండస్ట్రీలోనే ఎంతో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగారు కృష్ణ. ఆయన నటనతో కోట్లాదిమంది అభిమానులు సంపాదించుకోవడమే కాకుండా తెలుగు చిత్ర సీమలో సూపర్ స్టార్ గా మారారు. అలాంటి సూపర్ స్టార్ అంత్యక్రియల నిర్వహణ విషయంలో హీరో మహేష్ బాబుకు అనేక విమర్శలు వస్తున్నాయి. ఒక సామాన్య వ్యక్తికి చేసినట్టు మహాప్రస్థానంలో కృష్ణ గారికి అంత్యక్రియలు జరపడం సర్వత్రా అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ప్రముఖ వ్యక్తులు మరణించినప్పుడు వారి వారసులు వారికి ఇష్టమైనటువంటి సొంత ప్రాపర్టీస్ లో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఏఎన్నార్, ఎన్టీఆర్,కృష్ణంరాజు, ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రముఖుల అంత్యక్రియలు ఈ మాదిరిగానే జరిగాయి. ఇందులో ఎన్టీఆర్ మాజీ ముఖ్యమంత్రి అవ్వడంతో ప్రభుత్వం స్థలం కేటాయించింది.
Advertisement
also read:కార్తీ ‘సర్దార్’ ఓటీటీ రిలీజ్ డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?
దీంతో అక్కడ అంతక్రియలు నిర్వహించి అతని స్మారకాన్ని నిర్మించారు. ఇక ఏఎన్ఆర్ అంత్యక్రియలను అన్నపూర్ణ స్టూడియోలోనే చేశారు. సెప్టెంబర్ 11వ తేదీన కృష్ణంరాజు కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే. ఈయన అంత్యక్రియలను హీరో ప్రభాస్ మొయినాబాద్ లో గల ఫామ్ హౌస్ లో నిర్వహించారు. అంతేకాకుండా స్టార్ సింగర్ గా పేరుపొందిన ఎస్పీ బాలును సైతం తన సొంత ప్రాపర్టీ లోనే ఖననం చేశారు.ఈ విధంగా కోట్లాదిమంది ప్రజల మన్ననలు పొందిన ఈ ప్రముఖులను వారికి ఇష్టమైనటువంటి వారి సొంత ప్రాపర్టీలలోనే అంత్యక్రియలు నిర్వహించారు. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి చరిత్ర సృష్టించిన స్టార్ హీరో అంత్యక్రియలు మాత్రం మహాప్రస్థానంలో నిర్వహించడంపై ఆయన అభిమానులు మరియు ఇండస్ట్రీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
మహేష్ బాబు కుటుంబానికి చెందిన 30 నుంచి 40 ఎకరాల స్థలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఈ విధంగా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కృష్ణ గారు ఎంతో కష్టపడి ఇష్టంతో నిర్మించుకున్న పద్మాలయ స్టూడియోను అపార్ట్మెంట్స్ నిర్మాణానికి ఇచ్చేసినట్టు తెలుస్తోంది. అయితే అక్కడ మరో 5 ఎకరాల స్థలం కూడా ఉందట. పద్మాలయ స్టూడియోకి ప్రత్యామ్నాయంగా మహేశ్వరం ప్రాంతంలో కృష్ణ కొత్త స్థలం కొన్నారట. దీని పక్కనే మహేష్ బాబు కొనుగోలు చేసిన 30 ఎకరాలు స్థలం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇన్ని ప్రాపర్టీస్ ఉన్న మహేష్ బాబు మాత్రం కృష్ణ అంత్యక్రియలను మహాప్రస్థానంలో నిర్వహించాలని నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది కొంతమందిని ఆగ్రహానికి గురిచేస్తోంది. వారి సొంత స్థలాల్లో అంతక్రియలు జరిపి స్మారకం నిర్మించి ఉంటే ఆయనకు గౌరవం ఇచ్చినట్లు ఉండేది అంటున్నారు. ఒకవేళ ఆయన భార్య విజయనిర్మల బ్రతికి ఉంటే మాత్రం ఈ విధంగా జరగనిచ్చేది కాదని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆది శేషగిరిరావు, రమేష్ బాబు భార్య మృదుల కూడా మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించవద్దని చెప్పారని కూడా సమాచారం.
also read:DRDO JOBS : బీటెక్/డిగ్రీ అర్హతతో డీఆర్డీఓ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలిలా..