Advertisement
సూపర్ స్టార్ కృష్ణ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కృష్ణకి ఎక్కువే. ముఖ్యంగా లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కృష్ణకు బాగా ఎక్కువ ఉండేది. మిగిలిన హీరోలతో పోల్చి చూస్తే కృష్ణకి లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. విజయనిర్మలని పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణ రేంజ్ ఇంకా పెరిగిపోయింది.
Advertisement
కృష్ణ, విజయనిర్మల ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉండే వాళ్ళు. ఎంతోమంది ఈ జంట ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు. ప్రతి విషయాన్ని కూడా పట్టించుకునేది విజయనిర్మల. ఆయనకి పెళ్లికి ముందు పెళ్లి తర్వాత పెట్టిన కండిషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
మొదటి నుండి విజయనిర్మల ఎంతో మొండిగా ఉండే వారు. ఒక్క మాట అన్న కూడా ఆమె ఒప్పుకునేది కాదు. ఒక టైం లో వాణిశ్రీ రమాప్రభ తో విజయనిర్మల నటించిన దేవదాసు సినిమా ప్రదర్శిస్తే అక్కడ థియేటర్లో దోమలు తప్ప ఇంకేమి ఉండవని, నాగేశ్వరరావు గారు నటించిన దేవదాసు సినిమా కనుక వేస్తే 100 రోజులు ఆడుతుందని వ్యంగంగా కౌంటర్ వేశారు. దీంతో విజయనిర్మల వాణిశ్రీ తో మాట్లాడడం మానేసింది. చచ్చిపోయేంత వరకు కూడా ఆమె మాట్లాడలేదట. కృష్ణ ని కూడా మాట్లాడనివ్వలేదు. కనీసము ఆమెతో నటించే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. ఆమెతో కృష్ణ షూటింగ్ కి వెళితే గొడవపడి మరీ తీసుకు వచ్చేసింది విజయనిర్మల.
- మరి కొన్ని ముఖ్యమైన తెలుగు సినిమా వార్తలు, తెలుగు న్యూస్, నేటి తెలుగు వార్తల కోసం ఇక్కడ చూడండి !