Advertisement
ఘట్టమనేని కృష్ణ, తెలుగు చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. మూస పద్ధతిలో పోతున్న తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఒరవడిని నేర్పించారు. కౌబాయ్, సస్పెన్స్, థ్రిల్లర్ లాంటి జోనర్లను తెలుగు పరిశ్రమకు పరిచయం చేసిన ఘనుడు సూపర్ స్టార్ కృష్ణ. అన్నగారు ఎన్ టి రామారావు రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. ఆయన అడుగుజాడల్లోనే నడిచారు సూపర్ స్టార్ కృష్ణ. అప్పటి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కృష్ణ, మంగళవారం తెల్లవారుజామున కాంటినెంటల్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు.
Advertisement
ఇది ఇలా ఉంచితే, టాలీవుడ్ లో 5 దశాబ్దాల పాటు భిన్నమైన చిత్రాల్లో నటించిన కృష్ణకి అప్పట్లో ఏకంగా 2500 అభిమానుల సంఘాలు ఉండేవట. ఇందులోని ఒక సంఘానికి మెగాస్టార్ చిరంజీవి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా గతంలో ఒకసారి వెల్లడించిన చిరంజీవి, కృష్ణ స్పూర్తితోనే సినిమాల్లోకి వచ్చినట్టు గుర్తు చేసుకున్నారు.
Advertisement
కృష్ణ అభిమాన సంఘాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో తమిళనాడు, కర్ణాటకలోనూ ఉండేవట. 1981లో తోడుదొంగలు సినిమా రిలీజ్ కి ముందు ‘పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్’ పేరుతో అప్పట్లో ఓ కరపత్రం విడుదల చేశారు. అందులో ఆ ఫ్యాన్స్ యూనిట్ కి గౌరవ అధ్యక్షుడిగా చిరంజీవి పేరు ఉండడం గమనార్హం. అంతేకాదు, కృష్ణతో కలిసి ఆ సినిమాలో చిరంజీవి కూడా యాక్ట్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆ కరపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ లో మూడు షిఫ్ట్ లోను పనిచేసిన అతి కొద్ది నటుల్లో కృష్ణ ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. దాదాపు 340 కి పైగా చిత్రాల్లో నటించిన కృష్ణ, ఒకే ఏడాది అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోగా అప్పట్లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. 1972లో కృష్ణ ఏకంగా 18 సినిమాల్లో యాక్ట్ చేశారు.
READ ALSO : Ravindra Jadeja: పాపం జడేజా.. బీజేపీ నుంచి భార్య.. కాంగ్రెస్ నుంచి సోదరి..