Advertisement
సీనియర్ నటుడు ఉప్పలపాటి కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. పోస్టు కోవిడ్ సమస్యలు రావడంతో ఇటీవల హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ఆయన చేరారు. ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ సమస్యలతో ఆయన చాలా బాధపడ్డారు. దాంతో పరిస్థితి అత్యంత విషమంగా మారి ఆయన, ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.
Advertisement
ఇది ఇలా ఉండగా కృష్ణంరాజు…తన చివరి కోరికలు నెరవేరకుండానే మృతి చెందారు. బిజెపి కేంద్ర నాయకత్వం ఆయనకు గవర్నర్ పదవి ఇస్తుందని అదిష్టానం నుంచి సానుకూల కబుర్లు అందాయి. దీంతో ఆయన ఈ పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ఆయనతో పాటు రాజకీయాల్లో కేంద్ర మంత్రి పదవి నిర్వహించిన బండారు దత్తాత్రేయ, చెన్నమనేని విద్యాసాగరరావులకు గవర్నర్ పదవులు వరించాయి.
Advertisement
కానీ కృష్ణంరాజుకు నిరాశే మిగిలింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో బిజెపితో కూడిన ప్రభుత్వం ఏర్పడటం, కేంద్రంలో బలమైన ప్రభుత్వం రూపుదిద్దుకోవడంతో కృష్ణంరాజు కేంద్ర నాయకత్వంతో మంచి సంబంధాలు కొనసాగించారు. దీంతో ఢిల్లీ రాజకీయాల్లో కృష్ణంరాజు పరపతి పెరిగింది. దీంతో ఆయనకు తప్పనిసరిగా ఏదో ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి నామినేటెడ్ పదవి వస్తుందని ఆయనతోపాటు అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ అది నెరవేరలేదు. అలాగే భక్తకన్నప్ప సినిమాను ప్రభాస్ తో రీమేక్, తానే డైరెక్ట్ చేద్దామనుకున్నారు. ప్రభాస్ వేరే ప్రాజెక్టులతో బిజీగా మారడంతో పట్టాలెక్కలేదు. విశాల నేత్రాలు నవల ఆధారంగా మూవీ తీయాలనుకున్నారు. మన ఊరి పాండవులు సినిమాను ప్రభాస్ తో రీమేక్ చేయాలని అనుకున్నారు.
Read also : చివరి కోరిక తీరకుండానే మరణించిన కృష్ణంరాజు..ఆ కోరిక ఏంటంటే !