Advertisement
కృష్ణవంశీ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలోని విలక్షణ దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు, సామాజిక అంశాలు, దేశభక్తి, సంస్కృతీ సంప్రదాయాలు, కుటుంబ సంబంధాలు ఆయన సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈయన మొదటి సినిమా గులాబీతో దర్శకుడుగా మారారు. రెండవ సినిమా ఏకంగా నాగార్జునతో తీసారు. బ్లాక్ బాస్టర్ హిట్ ని అందుకున్నారు. సింధూరంలో నక్సలైట్లు పోలీసులు మధ్య సామాన్య ప్రజలు ఎలా నలిగిపోతున్నారో చూపించారు.
Advertisement
ఆ తర్వాత అంత:పురం, సముద్రం, మురారి, ఖడ్గం ఇలా అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు. కృష్ణవంశీ జోరు తగ్గింది అనుకునే లోగా గత ఏడాది రంగమార్తాండతో వచ్చి సందడి చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లను అందంగా చూపించే దర్శకుల్లో కృష్ణ వంశీ రాఘవేంద్రరావు తర్వాత స్థానంలో ఉన్నారు. రంగ మార్తాండ తర్వాత కృష్ణవంశీ మరో ప్రాజెక్ట్ ఏది అనౌన్స్ చేయలేదు.
Advertisement
Also read:
Also read:
ఆయనతో మూవీస్ తీసేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నా కృష్ణవంశీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు ఒకానొక సమయంలో సినిమాలన్నీ ప్లాప్ అవడం చేతిలో సినిమాలు లేక జీవితం ఎలా ఉందో ఎటు పోతుందో అర్థం కానీ స్థితిలో ఉన్నప్పుడు చిరంజీవి అవకాశం ఇచ్చి బతికించాడని కృష్ణవంశీ చెప్తూ ఉంటారు. తను ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని తెలుసుకుని చరణ్ తో గోవిందుడు అందరివాడేలే సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!