Advertisement
పల్లెటూరు, కుటుంబం, దేశ భక్తి.. ఇలా చెబుతూ పోతే థ్రిల్లర్ నుండి ఫాంటసీ వరకు దాదాపు ప్రతి జానర్‌ని టచ్ చేసిన చాలా మంది సీనియర్ దర్శకులు కృష్ణ వంశీ గారు ఒకరు. మనకి కృష్ణ వంశీ గా తెలిసిన ఆయన అసలు పేరు పసుపులేటి వెంకట బంగార్రాజు.
Advertisement
బౌండ్ స్క్రిప్ట్ లేకున్నా షూటింగ్ స్పాట్ లోనే సగం డైలాగ్స్, సీన్స్ చేస్తారు.. అదే అయన ప్రత్యేకత. ఆయన సినిమాలంటే, ఫ్రేమ్ మొత్తం నిండే మనుషులతో పాటు, ఆ మనుషుల మధ్య మహాలక్ష్మి లా కలకలలాడే హీరోయిన్ కూడా గుర్తొస్తుంది..
తెలుగుదనం ఉట్టిపడేలా కట్టు బొట్టుతో పాటు.. కొంచెం కారం కూడా తన సినిమాలో హీరోయిన్స్ కి. హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్ లో ఒక ప్రత్యేకత ని ఇచ్చే డైరెక్టర్స్ లో కృష్ణ వంశీ గారు ఒకరు. హీరోయిన్ అనే కాదు అమ్మ, వదిన, అక్క, ఆతమ్మ, బామ్మ ఎక్కువగా కనిపించే ఆడవాళ్లందరి పాత్రలు బాగా చూపిస్తారు వంశీ. అలాంటి కృష్ణ వంశీ సినిమాల్లో నటించిన హీరోయిన్ల పాత్రల గురించి తెలుసుకుందాం.
Advertisement
Costumes:కృష్ణ వంశీ దర్శకత్వంలోనే గులాబీ, నిన్నే పెళ్లాడతా, మురారి, చందమామ, గోవిందుడు అందరివాడేలే సినిమాలు వచ్చాయి. గులాబీ సినిమాలో మహేశ్వరి చాణక్యన్ మిర్రర్ వర్క్ డ్రెస్‌లు, గ్రాఫిక్ టీస్, స్క్రాంచీలు ధరించి అందంగా కనిపించారు. ఇక నిన్నే పెళ్లాడతాలో డంగేరీలు, హెడ్ బ్యాండ్‌లు, లూజ్ టీ షర్టులు ధరించి టబు అలరించింది. ఒక్కసారి అయినా ఈ లుక్స్ ట్రై చెయ్యాలి అనే విధంగా ఉంటాయి.
హీరోయిన్ల పెంకితనం : కృష్ణ వంశీ సినిమాల్లో అల్లరి చేస్తు, అలుగుతు, చిలిపిగా కూడా ఫుల్ టూ ఎమోషనల్ కూడా ఉంటారు హీరోయిన్లు. ఎవరేం అనుకుంటారు అనే బిడియం లేకుండా వాళ్లకి నచ్చింది చేస్తారు, నచ్చినట్లు ఉంటారు.
శ్రీను, చందు, బావా.. అబ్బా ఏం పిలుస్తారండీ బాబూ. అలా పిలిస్తే ఏ అబ్బాయి పడకుండా ఉంటాడు చెప్పండి. ఇప్పటికి శ్రీను పేరు విన్న ప్రతిసారి నిన్నే పెళ్లాడతా టబు గుర్తొస్తుంది.
హీరోయిన్ల అందం : కృష్ణ వంశీ సినిమాల్లో హీరోయిన్ల కళ్లలో.. కోపం, ప్రేమ, భయం, అమాయకం ఎంత బాగా కనిపిస్తుంది. ప్రేమని ఎక్కువ పెద్దలలో, కోపాన్ని ఎక్కువ కళ్ళలో చూపించడంలో కృష్ణ వంశీని కొట్టేవారే లేరు.
Read also : బిగ్ బాస్ లో వినిపించే గంభీరమైన వాయిస్ ఎవరిదో తెలుసా?