Advertisement
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి తరలించారు. తన జీవితంలో ఎన్నో సినిమాలు చేసిన కృష్ణంరాజు పరిశ్రమలో ఎన్నో ఒడిదడుగులు ఎదుర్కొన్నారట.
Advertisement
నిజానికి తన తొలిచిత్రం ‘చిలకా గోరింక’ సినిమా తర్వాత సినీ పరిశ్రమ నుంచి కృష్ణంరాజు వెళ్లిపోవాలని అనుకున్నారు. ఎందుకంటే ఆ సినిమా అనుకున్న మేర సక్సెస్ ఇవ్వలేదు. ఆ బాధతోనే ఆయన తనకు సినిమాలు అచ్చి రావేమో అనుకున్నారు. అదే సమయంలో ‘నేనంటే నేనే’ సినిమాలో అవకాశం రాగా, పాత్ర నచ్చక అంగీకరించలేదు. సరిగ్గా అప్పుడే నిర్మాత ఎల్వి ప్రసాద్ ను కలుసుకోవాల్సి వచ్చింది.
Advertisement
“నీవు చేసిన పాత్ర ఎలాంటిది అన్నది కాదు. ఆ పాత్ర ద్వారా ప్రజలకు చేరువ అయ్యావా? ఇచ్చిన పాత్రకు న్యాయం చేసావా? అన్నదే నటుడిగా నీవు చూడాల్సింది” అని ఎల్వి.ప్రసాద్ చెప్పారట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో కృష్ణంరాజు స్వయంగా వెల్లడించారు. ఎల్వి ప్రసాద్ చెప్పిన మాటలు ధైర్యాన్ని ఇవ్వడంతో కృష్ణంరాజు ‘నేనంటే నేనే’ సినిమా చేశారు. అది విజయవంతం కావడంతో ఆయనలో నమ్మకం పెరిగింది. అప్పుడు భిన్నమైన పాత్రలతో అవకాశాలు తలుపు తట్టాయి. దీంతో అసలు తాను పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఎల్వి ప్రసాద్ కారణమని కృష్ణంరాజు గతంలో చెప్పారు.
READ ALSO : కో స్టార్స్ నే ప్రేమలో దింపి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే !