Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీలో తన ప్రస్థానం ఎంతో గొప్పది. తను ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి చిన్న అభియోగం కూడా లేని రెబల్ స్టార్ గా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణంరాజు. అంతటి పేరు ఉన్న మహారాజు అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు విడిచారు.. రాజుల వంశానికి చెందిన కృష్ణంరాజు మొదటినుంచి ధనవంతుడు.. 1966లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 185 చిత్రాలకుపైగా నటించారు. రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ప్రజల్లో మమేకమై ఎంపీగా పలుమార్లు గెలిచి కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
Advertisement
అయితే, కృష్ణంరాజు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. అందులో ఒకటి కృష్ణంరాజు గారి అల్లుడు కూడా సినీ రంగానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఇక విషయంలోకి వెళితే కృష్ణంరాజు గారు సినీ నటుడు గా రాణిస్తున్న రోజుల్లోనే సీతాదేవిని మొదటి వివాహం చేసుకున్నారు. అయితే వీరికి పిల్లలు కలగకపోవడంతో ఓ అమ్మాయిని పెంచుకున్నారు. ఆ అమ్మాయి అంటే కృష్ణంరాజు గారికి పంచప్రాణాలు. ఆ అమ్మాయి పేరే ప్రశాంతి. ఇక ఆ తర్వాత సీతాదేవి రోడ్డు ప్రమాదంలో మరణించాక, కుటుంబ సభ్యుల ఒత్తిడితో శ్యామల దేవిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. అయితే శ్యామలాదేవి గారు కృష్ణంరాజు దత్తత తీసుకున్న అమ్మాయి ప్రశాంతిని చాలా ప్రేమగా పెంచింది. కృష్ణంరాజు ప్రశాంతిని స్వయానా తన మేనల్లుడికి ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేశాడు.
Advertisement
ఆ మేనల్లుడు ఎవరో కాదు అతని పేరు నరేంద్రనాథ్. ఇక ఈయన కూడా సినిమా రంగానికి చెందిన వాడే. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా అడుగుపెట్టాడు. ఈయన ప్రభాస్ హీరోగా నటించిన రెబల్, బిల్లా వంటి సినిమాలకు నిర్మాతక వ్యవహరించారు. ఓ పక్క నిర్మాతగా, మరోపక్క రాజకీయ రంగంలో కూడా రాణిస్తున్నాడు. ఇక నరేంద్రనాథ్, కృష్ణంరాజు చనిపోయాక అంతిమ కార్యక్రమాల నుండి ఇప్పటివరకు అన్ని అల్లుడిగా దగ్గరుండి చూసుకుంటున్నాడు. ప్రశాంతి, నరేంద్రనాథ్ కి ఇద్దరు ఆడపిల్లలు. కృష్ణంరాజుకి మనవరాలు అంటే చాలా ఇష్టం.
Read also : రాజమౌళి నటుడు చంద్రశేఖర్ పర్సనల్ లైఫ్ గురించి మనకు తెలియని నిజాలు..!