Advertisement
రాజకీయ వర్గాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం. ప్రతీ రోజూ చూస్తూనే ఉంటాం. సాధారణంగా ఒకే రాష్ట్రానికి చెందిన నాయకులు రోజూ విమర్శలు చేసుకుంటారు. ఒక రాష్ట్రానికి చెందిన నాయకులు మరో రాష్ట్ర నాయకులు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే విమర్శిస్తుంటారు. ఈ మధ్యకాలంలో అవి కూడా రోజు అలవాటుగా మారిపోతున్నాయి. తాజాగా కాంగ్రెస్, బీజేపీలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.
Advertisement
Advertisement
కరెంట్ లేక రాబందుల పొడుచుకు తిన్న కాంగ్రెస్ కావాలో, లేక రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని కోరారు. మంత్రి కేటీఆర్ తాజాగా విలేకరులతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని చీల్చి… తమ పార్టీ ఎమ్మెల్యేలను కొని… తెలంగాణ వ్యతిరేకించిన కేవీపీ రామచంద్రరావు… ఇవాళ తాను ఇక్కడి వాడినే అంటున్నారు. అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్న కిరణ్ కుమార్ రెడ్డి బిజెపికి దిశా నిర్దేశం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి పార్టీలకు అవకాశాలు ఇవ్వకూడదని కోరారు మంత్రి కేటీఆర్.
సమైక్య ఆంధ్రాలో తెలంగాణకు శాపనార్ధాలు పెట్టిన షర్మిల కూడా ఇప్పుడు తెలంగాణ వాది అంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి సమయంలో భారత రాష్ట్ర సమితి పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
- మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ చదవండి !