Advertisement
కొంతకాలంగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేక విషయాల్లో చుక్కలు చూపించారు. అనేక అంశాల గురించి ప్రశ్నలు వేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటుగా మంత్రులతో సవాళ్లు కూడా విసురుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మితమైన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పై అనేక విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. తాజాగా కాలేశ్వరం ప్రాజెక్ట్ విషయంపై కేటీఆర్ మాట్లాడారు. BRS ఎమ్మెల్యే కాలేశ్వరం పర్యటన రెండవ రోజు కొనసాగుతోంది.
Advertisement
ఈ సందర్భంగా కన్నేపల్లి పంపు హౌస్ పై కేటీఆర్ సందర్శించారు తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి పెద్దదైన భారత దేశ స్వతంత్ర చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కాలేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని అన్నారు తెలంగాణకు కల్పతరువు కాలేశ్వరం ప్రాజెక్ట్ అని ఆయన అన్నారు. తెలంగాణలో కరువు అనే మాట వినిపించకూడదని కేటీఆర్ నిర్మించారని గతంలో నీటి సమస్య ఉందని రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
Advertisement
Also read:
పంటల సాగు కోసం నీరు ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం లేదని కేటీఆర్ చెప్పారు ఎగువ నుండి నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని 17 టీఎంసీల సామర్థ్యంతో కొండపోచమ్మ సాగర్ నిర్మించామని చెప్పారు. నీటి అవసరాల కోసం దీనిని నిర్మించామని సాగు అవసరాల కోసం 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్న సాగర్ నిర్మించామని అన్నారు నేటి ఎత్తిపోయకపోతే 50,000 మంది రైతులతో తామే వస్తానని పంపులు మేమే ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇస్తామని అన్నారు. నీటి ఎద్దడి పరిస్థితులు ఉన్న మోటార్లు ఆన్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!