Advertisement
గుడివాడ నుంచి వచ్చిన కుమారి ఆంటీ హైదరాబాద్ లో రోడ్ సైడ్ నే ఫుడ్ అమ్ముతూ బిజినెస్ చేసుకుంటున్నారు. ఆమె పూర్తి పేరు దాసరి సాయి కుమారి. సోషల్ మీడియాలో కుమారి అంటీగా ఫేమస్ అయ్యారు. మీ బిల్ వెయ్యి రూపాయలు అయ్యింది అంటూ ఓ కస్టమర్ ని ఉద్దేశించి ఆమె అనడం ఓ వీడియోలో రికార్డు అయ్యింది. ఈ వీడియో చాలా వైరల్ అయ్యింది. ఆ తరువాత కుమారి ఆంటీ ఫుడ్ ట్రక్ కూడా చాలా పాపులారిటీ తెచ్చుకుని బిజినెస్ పరంగా దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆ పాపులారిటీ ఆమెకు కొంత నెగటివ్ ఇంపాక్ట్ తెచ్చినా.. సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు మద్దతు ఇవ్వడంతో ఆమె వ్యాపారం తిరిగి పుంజుకునే అవకాశం ఉంది.
Advertisement
ఇది ఇలా ఉంటె.. ఆమె ఓ సారి ఓ యు ట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు ఇల్లు ఇచ్చారు అని చెప్పుకొచ్చింది. దీనితో.. వైసీపీ అభిమానులు, కార్యకర్తలు ఈ వీడియో బిట్ ను తెగ వాడేసుకుని వైసీపీ పార్టీ ప్రచారం చేసుకుంటూ వచ్చారు. దీనితో కుమారి ఆంటీ పై రాజకీయ రచ్చ మొదలైంది. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో కొత్త వీడియో హల్ చల్ చేస్తోంది.
Advertisement
ఆవిడ క్లియర్ గానే ఉంది…. వీళ్ళకే చాలా సస్పెన్స్ తరువాత అర్ధమయ్యింది…
ఇప్పుడు పేటీఎంలలో ముఖచిత్రాలు ఏంటో 🤣#KumariAunty pic.twitter.com/U7OtFEkG90
— KUPPAM—TDP (@KuppamTdp) January 31, 2024
మరో యూట్యూబ్ ఛానెల్ వ్యక్తి ఆమెకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు అని అడుగగా.. ఆమె ఇంటరెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి నా ఓటుని చంద్రబాబు నాయుడుకే వేసాను అంటూ ఆమె చెప్పుకొచ్చారు. దీనితో ఈ వీడియో ను టీడీపీ అభిమానులు కార్యకర్తలు వైరల్ చేయడం ప్రారంభించారు. ఓ వైపు వైసీపీ పార్టీ కార్యకర్తలు, మరో వైపు టీడీపీ కార్యకర్తలు కలిసి ఆమె వీడియోలు వైరల్ చేస్తూ.. ఆమెను రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మార్చారు. ఈ వ్యవహారం ఎపి రాజకీయాల్లో ఎంతవరకు ముందుకు వెళ్తుందో చూడాలి.
Read More:
పెళ్లి చేసుకోనున్న బర్రెలక్క, బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్? వైరల్ అవుతున్న న్యూస్..?
వైరల్ అయిన కుమారి ఆంటీ ఒకప్పుడు హేమ చంద్ర ఇంట్లో వంట మనిషి అని తెలుసా? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?