Advertisement
మునుగోడు ఉప ఎన్నికల్లో ముందుగా ఊహించినట్లే టిఆర్ఎస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 10,297 ఓట్ల మెజార్టీ సాధించారు. తొలి రౌండు నుంచే టీఆర్ఎస్ లీడింగ్ కనబరిచింది. రెండు, మూడు రౌండ్లలో మాత్రమే బిజెపి అభ్యర్థి లీడ్ లో ఉండగా, ఆ తర్వాత కౌంటింగ్ జరిగినా అన్ని రౌండ్లలో టిఆర్ఎస్ తన మెజార్టీని పెంచుకుంటూ పోయింది.
Advertisement
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వానికే మునుగోడు ప్రజలు పట్టం కట్టారు. కమీషన్ల కాంట్రాక్టుకు చరమగీతం పాడి, అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతున్న అధికార పార్టీకే జై కొట్టారు. బిజెపి ఎన్ని కుట్రలు, జిమ్మిక్కులు చేసిన వారి కుట్రలను ప్రజలు తిప్పి కొట్టారు. భారత్ రాష్ట్ర సమితికి పునాది రాయి వేసి, దేశ దృష్టిని ఆకర్షించారు మునుగోడు ఓటర్లు.
Advertisement
నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్న మోడీకి ఈ ఎన్నికల్లో ఓటమి ద్వారా కనువిప్పు కలిగించారు. బిజెపి ఆటలు, మోదీ మోసాలు తెలంగాణలో సాగవని నిరూపించారు మునుగోడు ప్రజలు. ఇక గతంలో ఇది కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కాగా, ఈసారి ఆ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. పాల్వాయి స్రవంతికి 20 వేల ఓట్లకు పైగా వచ్చాయి.
ఇక ఈ విజయంపై కేటీఆర్ స్పందించారు. నల్లగొండ జిల్లాలో 12కి 12 స్థానాలు గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు.. అమిత్ షా, మోడీ అహంకారానికి చెంపపెట్టులా మునుగోడు ప్రజలు తీర్చిచ్చారు.. 9 రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలను కూల్చారని తెలిపారు మంత్రి కేటీఆర్. మునుగోడులో అభివృద్ధికి, అహంకారానికి మధ్య జరిగినపోరు. రాజకీయాల్లో హత్యలు వుండవు… ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి.. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపులో కృషిచేసిన వామపక్ష నేతలకు ధన్యవాదాలు అన్నారు మంత్రి కేటీఆర్.
read also : బ్రహ్మంగారు చెప్పిందే జరిగింది, మేక లాగా పుట్టిన కుక్కపిల్ల!