Advertisement
Laal Singh Chaddha Review : అమీర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డ’. కరీనాకపూర్, అక్కినేని నాగచైతన్య, కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ఫారెస్ట్ గంప్ కు హిందీ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రానికి అద్వేత్ చందన్ దర్శకత్వం వహించారు. వయాకామ్ స్టూడియోస్, పారా మౌంటు పిక్చర్స్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై అమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ ఆందారే లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే భారీ అంచనాల మధ్య ఇవాళ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Advertisement
కథ: 1994లో వచ్చిన ఫారెస్ట్ గంప్ కు రీమేక్ ఇది. ఈ సినిమాను అప్పట్లో ప్రేక్షకులు ఎగబడి చూశారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ కి దీని మీద అవగాహన చాలా తక్కువగా ఉంది. అందుకే ఎటువంటి రిస్క్ గురించి ఆలోచించకుండా అమీర్ ఖాన్ ఈ సినిమాకు ఒప్పుకున్నాడు.
Advertisement
అంగవైకల్యంతో బాధపడే వచ్చిన పిల్లాడు తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో ఎదుగుతుంటాడు. ఆ తర్వాత ఆర్మీలో చేరి రాష్ట్రపతి పథకం స్వీకరించే స్థాయికి ఎదుగుతాడు. ఇక ఆ క్రమంలో అతను ఎదుర్కొన్న మనుషులు, సంఘటనలు సమూహారమే ఈ సినిమా. ఇక డైరెక్టర్ ఈ సినిమాకు తగిన నటి నటులను ఎంచుకున్నాడు. ప్రీతమ్ అందించిన మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.
#ప్లస్ పాయింట్స్:
అమీర్ ఖాన్, నాగచైతన్య యాక్టింగ్
కరీనాకపూర్ పాత్ర
సినిమాటోగ్రఫీ బాగుంది.
#మైనస్ పాయింట్స్:
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
స్లోగా నటించిన స్టోరీ
#రేటింగ్: 3/5
also read: “Film” మరియు “movie” ఇందులో ఏది కరెక్ట్ పదమో మీకు తెలుసా..?