Advertisement
ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తాజాగా తాను రచించిన ‘అల్లుడు సుద్దులు’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా “నాకు, మా అల్లుడికి మధ్య 26 ఏళ్ల నుంచి పిల్లి, ఎలుక మధ్య జరిగే పోరాటంలా.. పోరాటం కొనసాగుతూనే ఉందన్నారు తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి.
Advertisement
Advertisement
అయితే వైసీపీ ఓ క్రమ శిక్షణ కలిగిన పార్టీ అని.. వైసీపీ ఓ క్రమ శిక్షణ కలిగిన పార్టీ అని తెలిపారు. సాహిత్యంలో సెటైరికల్ రచనలు ఓ ఆనవాయితీ అని.. శ్రీరమణ రాసిన పుస్తకాలు పొలిటికల్ సెటైరికల్ రచనలు బాగుంటాయని తెలిపారు. ముఖ్యంగా లోకేష్ కి అర్హత చూడకుండా మంత్రి పదవీ ఇచ్చారని విమర్శించారు. ఇవన్నీ కలిసి సెటైరికల్ గా ఈ పుస్తకాన్ని రాసినట్టు తెలిపారు. తండ్రి కొడుకులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పండిస్తున్న హాస్యాన్ని మిళితం చేసి చిత్తూరు మాండలికంతో ఇదో ప్రయత్నం చేశానన్నారు. గత 25 ఏళ్లుగా చంద్రబాబు గురించి పలు పుస్తకాలు రాశానని పేర్కొన్నారు. ప్రస్తుతం అల్లుడు సుద్దులు పుస్తకాన్ని చిత్తూరు మాండలికంలో రాసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో తిరుగుతూ ప్రజలను ఎంటర్టైన్ చేస్తున్నారని.. నా పుస్తకంలో వాళ్ల గురించి హాస్యంగా రాశానని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. ప్రస్తుతం లక్ష్మీ పార్వతి చేసిన కామెంట్ కాస్త వైరల్ గా మారాయి.