Advertisement
మనం టీవీ లో ఏదైనా షో లేదా సినిమా చూస్తూ ఉంటాం .. మధ్యలో బ్రేక్ వస్తుంది. అంతలోనే డబ్బులు ఊరికే రావు అనే డైలాగుతో ఎంటర్ అవుతారు లలిత జ్యువెలరీ ఎండి కిరణ్ కుమార్.. ఆయన చెప్పే డైలాగ్ మరియు ఆయనను చూస్తే ఏదో తెలియని ఆసక్తి ఉంటుంది.. ఈ ఒక్క డైలాగ్ తోనే ఈ నగల వ్యాపారి సెలబ్రిటీగా మారిపోయారు.. మరి ఆయన నగల వ్యాపారం గురించి పెద్ద పెద్ద హీరో హీరోయిన్లతో ప్రమోట్ చేయించవచ్చు కదా అని అందరికీ డౌట్ రావచ్చు.. కానీ దీనిపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.. కిరణ్ కుమార్ అతి సాధారణ స్థాయి నుండి ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి ఎదిగారు..
Advertisement
also read ఇదంతా నిన్నే జరిగినట్టు ఉంది అంటూ… రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్!
ఒకప్పుడు కనీసం తిండి కూడా లేని పరిస్థితి నుండి ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం ఆయనకు ఉన్న సింప్లిసిటీ అని చెప్పవచ్చు. అయితే తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఆ ఇంటర్వ్యూ లో యాంకర్ మీరు ఎప్పుడు గుండు తోనే కనబడతారు అని ప్రశ్నించగా.. ఆయన ఇలా సమాధానమిచ్చారు.. ఒకప్పుడు నాకు చాలా ఒత్తుగా జుట్టు ఉండేది.. ఆ టైంలో నేను తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకుని వచ్చాను. దీంతో ఆ గుండు లో ఆయన ను చూసిన వారు మీకు గుండు చాలా సెట్ అయింది, చాలా బాగుంది అని చెప్పారట. కానీ ఆయనకు ఫుల్ గా హెయిర్ ఉన్నప్పుడు ఎవరు కూడా బాగుంది అని చెప్పలేదు.
Advertisement
కానీ గుండు చేసుకోగానే చాలా బాగుంది అని చెప్పుకొచ్చారు. దీంతో అప్పటి నుంచి నేను గుండు మెయింటెన్ చేస్తూ వస్తూన్నానని ఆయన సమాధానమిచ్చారు. అలాగే మీ లలిత జ్యువెలరీ కి మీరే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారు అనే ప్రశ్నకు సమాధానంగా.. నాకు కస్టమర్ల ను దోచుకోవడం ఇష్టం ఉండదు, ఒక పెద్ద హీరో ని ప్రమోట్ చేసి బిజినెస్ చేస్తే బాగుంటుంది. కానీ ఆ హీరోకు నేను కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ప్రమోట్ చేస్తే, మళ్లీ ఆ పెట్టుబడి రావడానికి కస్టమర్ల పై వసూలు చేయాలి.. అలా నాకు కస్టమర్ల పై భారం వేయడం ఇష్టం ఉండదు. అందుకే నా బిజినెస్ ను నేనే ప్రమోట్ చేసుకుంటున్నా అని సమాధానం ఇచ్చారు.