Advertisement
Tollywood Actress Heroine Laya: ఇండస్ట్రీ లోకి ఎంతోమంది హీరోయిన్లు వచ్చి కోట్లాదిమంది ప్రేక్షకాభిమానాన్ని పొంది వారి వారి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఇక మరికొందరు హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలతోనే చాలా ఫేమస్ అయ్యేవారు. అంతేకాదు వారు నటించిన ఒక్క సినిమాతోనే ఇప్పటిదాకా ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా వారి పాత్రలు ఉండేవి. అలా విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన స్వయంవరం చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ హీరోయిన్ లయ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్ గా దాదాపు 13 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఇండస్ట్రీలో కొనసాగింది లయ. అచ్చమైన తెలుగు అమ్మాయిగా కనిపిస్తూ చక్కటి సినిమాలతో తెలుగు జనాల మనసులో నిలిచిపోయింది.
Advertisement
Read also: 2020 కరోనా తరువాత జరగబోయేది ఇదేనా ? కాలజ్ఞానం లో ఇదే చెప్పబడిందా ?
Advertisement
నిజానికి తనకు స్వయంవరం సినిమా తొలి సినిమా కాదు.. భద్రం కొడుకో సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా విజయం సాధించలేదు. అందుకే ఆమె తొలి సినిమా స్వయంవరం అనే అంటారు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో దాదాపు 30 కి పైగా సినిమాలలో నటించింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే ఎన్నారై డాక్టర్ గణేష్ ని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ తన గురించి కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించింది. తనని అందరూ చాలా పెద్ద కోటీశ్వరులు అనుకుంటారని.. అవును నేను అంబానీ చెల్లెల్ని అని లయ సరదాగా చెప్పింది. తనకి సొంత విమానం ఉందని, వేల ఆస్తులు ఉన్నాయని ఏవేవో అనుకుంటున్నారని.. కానీ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.
తన భర్త డాక్టర్ కావడం వల్ల మూడు హాస్పిటల్స్ ఉన్నాయని తెలిపింది. ఆస్తి పరంగా బాగానే ఉన్నాము కానీ.. ఓన్ ఫ్లైట్, టాటా మనవరాలిని అనేంత రేంజ్ మాది కాదంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే పెళ్లి తర్వాత తన కెరీర్ నీ కుటుంబానికే పరిమితం చేసిన లయ ఇప్పుడు మళ్లీ స్ట్రాంగ్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. అయితే ఈమెకు ఇప్పటికే పలు సినిమాలలో అవకాశాలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఓ యంగ్ హీరో మూవీలో అక్కగా నటించేందుకు రెడీ అవుతుందట లయ. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో లయ కెరీర్ ముందుకు దూసుకెళ్తుందా? లేదా? అనేది చూడాలి.
Read also: RANA NAIDU WEB SERIES REVIEW: రానా నాయుడు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్