Advertisement
సూర్య సినిమాలపై ఓ కామెంట్ ఉండనే ఉంది. సూర్య సినిమాలు భవిష్యత్ ను చెప్పేస్తూ ఉంటాయి అని సరదాగా ఆయన అభిమానులు అంటుంటారు. ఇది చాలా సార్లు నిజమైంది కూడా. కొన్ని సంఘటనలు సూర్య సినిమాలలో ముందుగానే ఉహించి తీసినట్లు ఉంటాయి. అలాంటిదే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కూడా. లోకేష్ కనగరాజ్ సినిమా అంటే.. సినిమా ప్రేమికుల్లో గొప్ప ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే తన సినిమాలన్నీ ఇంటర్ లింక్ అయ్యి కొత్త ఉత్సుకతని రేకెత్తిస్తూ ఉంటాయి. ఇటీవల లోకేష్ కనగరాజ్ సినిమా “లియో” విడుదల అయ్యి ఏ స్థాయిలో ఫలితం రాబట్టిందో తెలిసిందే.
Advertisement
ఇక LCU (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) సంగతి చెప్పక్కర్లేదు. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలకు లింక్ పెట్టి గత సినిమాల్లో వచ్చిన సన్నివేశాలకు కొనసాగింపు చూపిస్తూ.. రాబోయే సినిమాల్లో ఏమి జరగబోతుందో చూపించి రాబోయే సినిమాపై కూడా ఆసక్తి పెంచేసాడు లోకేష్. ఇక లోకేష్ సినిమా అంటే ఏ హీరో స్పెషల్ అప్పియరెన్స్ ఉంటుందా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే.. LCU లో లోకేష్ చూపించిన క్యారెక్టర్స్ అన్నీ సూర్య 2009 లోనే తన సినిమాలో చూపించేసాడట.
Advertisement
KV ఆనంద్ దర్శకత్వం లో సూర్య హీరోగా 2009 లో వచ్చిన సినిమా “అయాన్”. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. తెలుగులో ఇది “వీడోక్కడే” గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో కూడా హీరో సూర్య డ్రగ్స్ డీలింగ్ చేసేవాళ్ళని పట్టుకోవడం, డ్రగ్స్ ని నాశనం చేయడం వంటివి చేస్తుంటాడు. లోకేష్ సినిమాలు కూడా ఇదే పాయింట్ పై ఉంటాయి. సూర్య సినిమాలో దాస్ అండ్ కో, ఢిల్లీ, పార్తీబన్ అన్న పేర్లతో క్యారెక్టర్లు ఉంటాయి. లోకేష్ సినిమాల్లో క్యారెక్టర్ల పేర్లు కూడా ఇవే. దీనితో సూర్య ముందే చూపించేసాడా? లేక లోకేష్ ఈ సినిమాకు పని చేశాడా? ఈ సినిమా నుంచే కథ రాసుకున్నాడా? అసలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఈ సినిమాతోనే మొదలైందా? అంటూ నెటిజన్స్ వరుస ప్రశ్నలు వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మరిన్ని..
రూల్స్ ని బ్రేక్ చేసిన చంద్రబాబు నాయుడు.. బెయిల్ రద్దు చెయ్యాలి అంటూ..?
విచిత్రంగా పెళ్లి పెటాకులు మహోత్సవాలు.. దానికి పెట్టిన ఈ వింత పేరుని చూసారా?
చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావడం వెనుక అసలేం జరిగింది? 28 రోజుల తరువాత మళ్ళీ జైలు కి వెళ్లాలా?