Advertisement
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశి వారి లక్షణాలను చెప్తూ ఉండవచ్చు. ఈ ఆర్టికల్ లో కన్య రాశి వారి లక్షణాల గురించి తెలుసుకుందాం. వీరితో స్నేహం, ప్రేమ, పెళ్లి వంటి బంధాలను ఏర్పరుచుకోవాలంటే.. వీరి గురించి కొన్ని విషాయాలను, వీరి లక్షణాలను తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు తమ భవిష్యత్ గురించి తెలుసుకోవాలని ఉంటుంది. ఇక పెళ్లి చేసుకునే ముందు కూడా తప్పకుండ జాతకాలు చూపించుకుంటూ ఉంటారు. తమ జీవితంలోకి వచ్చే అమ్మాయి లేదా అబ్బాయి జాతకం చూసుకుంటూ ఉంటారు. ఇక కన్య రాశి అమ్మాయిల జాతకం గురించి ఇప్పుడు చూద్దాం.
Advertisement
కన్య రాశివారికి సునిశిత దృష్టి ఉంటుంది. ప్రతి విషయం పట్లా వీరు శ్రద్ధ వహిస్తారు. ఎదుటివారి లోపాలను, తమ లోపాన్ని గుర్తిస్తూ ఉంటారు. ఇది మంచి లక్షణమే అయినా.. కొన్నిసార్లు ఇది విమర్శనాత్మకంగా అనిపిస్తుంది. వీరు ప్రతి విషయంలోనూ కచ్చితత్వాన్ని అవలంభిస్తుంటారు. వీరు చక్కగా విశ్లేషణ చేస్తారు. తమకు ఎదురైన పరిస్థితులను, సమస్యలను, సవాళ్ళను తమ విశ్లేషణాత్మక పరిశీలనతో ఎదుర్కొంటారు. కొన్నిసార్లు ఈ ఆలోచన తీరు భాగస్వాములకు వరం కావచ్చు. లేదా వారు ఎక్కువగా ఆలోచించేలా చేయవచ్చు.
Advertisement
వీరికి ఇతరులకు సహాయం చేయాలి అన్న గుణం ఎక్కువగా ఉంటుంది. వీరు సలహా ఇవ్వడానికైనా, సహాయం చేయడానికైనా ముందుంటారు. తన చుట్టూ ఉన్న వారి శ్రేయస్సు గురించి ఆలోచించడంలో వీరు ముందుంటారు. అలాగే.. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఎల్లప్పుడూ తన జీవితం గురించి ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉంటారు. ఇతరుల పట్ల వీరు తమ మనసుని తెరవడానికి ఇష్టపడరు. కానీ వీరు మనసుని తెరవడానికి కొంత సమయం తీసుకున్నా.. ఎవరినైనా ఆహ్వానిస్తే మాత్రం కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారు.
Read More:
పాములు కాటు వేసే ముందు హెచ్చరిస్తాయా? అలాంటప్పుడు ఏమి చెయ్యాలో తెలుసా?
అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా “తండేల్” సినిమా టైటిల్ కి అర్ధం ఏంటో తెలుసా?
హాయ్ నాన్న సినిమా సెన్సార్ రివ్యూ వచ్చేసిందోచ్.. వారు ఏమన్నారంటే?