Advertisement
చాలామంది ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇంట్లో పెద్దలు కుదిర్చిన పెళ్లి కంటే ప్రేమ పెళ్లిళ్లు బాగా ఎక్కువైపోయాయి. పైగా ప్రేమకి డబ్బుతో సంబంధం కూడా ఉండదు ప్రేమలో పడితే ఆస్తి వంటివి ఏమీ గుర్తు రావు. ప్రేమ కోసం కోట్లు కూడా వదలుకోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. మల్లీశ్వరి సినిమాలో చూసినట్లయితే ప్రేమ కోసం మల్లీశ్వరి కోట్ల ఆస్తిని వదులుకుంటుంది ఇటువంటివి బయట కూడా జరుగుతూ ఉంటాయి. కానీ చాలా అరుదుగా జరుగుతుంటాయి.
Advertisement
అలాంటిది ఒకటి ఇప్పుడు చోటుచేసుకుంది. ఒక అమ్మాయి తన ప్రేమించిన అబ్బాయి కోసం కోట్ల ఆస్తిని వదిలేసుకుంది ఇది ఇండియాలో జరిగినది కాదు మలేషియాలో జరిగింది. మలేషియా కి చెందిన ఒక యువతి ప్రియుడు కోసం వారసత్వంగా వచ్చే వేల కోట్లను వదులుకుంది పూర్తి వివరాల్లోకి వెళితే.. యాంజిలిన్ అనే ఆమె పై చదువుల కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కి వెళ్ళింది ఆమె కి ఆ టైంలో ఒక అతనితో పరిచయం అవడం అది కాస్త ప్రేమగా మారడం ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిపోయాయి.
Advertisement
ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది వాళ్ళు వద్దని చెప్పారు. అతన్ని పెళ్లి చేసుకుంటే ఆస్తి ఏమీ రాదని చెప్పేసారు. సుమారు రూ.2500 కోట్ల ఆస్తిని ఆమె వదిలేసుకుంది 2008లో ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి ఒక్కరూ ఆమెని పొగుడుతున్నారు. ప్రియుడు కోసం అంత ఆస్తిని వదిలేసుకోవడం ఏమిటి అని కామెంట్లు చేస్తున్నారు.
Also read: