Advertisement
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. ‘సాలా క్రాస్ బీడ్’ ట్యాగ్ లైన్, పూరి కనెక్ట్, ధర్మ ప్రొడక్షన్ బ్యానర్స్ పై పూరి, ఛార్మి, కరణ్ జోహార్, హీరూ యష్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ గా ఎదగనున్నాడు. ఈ సినిమా దాదాపు మూడు ఏళ్లుగా తీశారు. దీంతో లైగర్ పై అందరికీ బాగా ఆశలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయింది.
Advertisement
READ ALSO : టాలీవుడ్ లో ఒకవెలుగు వెలిగి కనపడకుండా పోయిన 5 గురు హీరోలు ..!
#కథ మరియు వివరణ:
ఇక లైగర్ సినిమా కథ విషయానికి వస్తే, స్వతహాగా బాక్సర్ అయినా విదేశీయుడు మైక్ టైసన్ ఓ పని మీద ఇండియాకు వస్తాడు. ఇక ఆ సమయంలో ఆయన రమ్యకృష్ణను చూసి తనతో ప్రేమలో పడతాడు. అలా వీరికి లైగర్ విజయ్ దేవరకొండ పుడతాడు. అయితే లైగర్ తన తల్లితో కరీంనగర్ లో ఉంటాడు. లైగర్ కు దేశంలో గొప్ప ఫైటర్ గా ఎదగాలని ఆశ ఉంటుంది. దాంతో అతడు తన తల్లి రమ్యకృష్ణతో కలిసి ముంబైకి వెళ్తాడు. ఇక ఆ సమయంలో అక్కడ బాగా డబ్బున్న అమ్మాయి అనన్య పాండే తో లవ్ లో పడతాడు. ఇక లైగర్ ఇండియాలో మంచి పేరు తెచ్చుకొని అమెరికాకు వెళ్తాడు. అక్కడ మైక్ టైసన్ తన జీవితంలోకి వస్తాడు. ఆ తర్వాత మైక్ టైసన్, లైగర్ మధ్య ఏం జరుగుతుంది, ఇంతకు వాళ్లకు ఉన్న సంబంధం ఏంటి అనేది మిగిలిన కథలో చూడవచ్చు. ఈ సినిమాను థియేటర్లలో చూస్తే బాగా ఎక్కుతుంది.
Advertisement
లైగర్ గా విజయ్ చాలా సన్నివేశాల్లో నత్తి తో చాలా బాగా చేశాడు. అయితే కొన్ని కోర్ ప్రమోషన్స్ నీ ప్రదర్శించడంలో మాత్రం విఫలమయ్యాడు. బాక్సర్ గా కనిపించేలా అతని మేక్ ఓవర్ మనం అభినందించాలి. అనన్య పాండే కి నటనకు స్కోప్ లేదు. బాలమణి గా రమ్యకృష్ణ చాలా అద్భుతంగా చేసింది. ఆమె బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్ని అద్భుతంగా కుదిరాయి. రోనిత్ రాయ్, విష్ రెడ్డి, ఆలీ, మకరంద్ దేశ్ పాండే మరియు గెటప్ శ్రీను తమ పాత్రల మేరకు బాగా చేశారు. మైక్ టైసన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కానీ అతని పాత్రలో సరైన డెప్త్ లేదు.
#ప్లస్ పాయింట్స్:
విజయ్ దేవరకొండ నటన, తల్లి కొడుకుల సన్నివేశాలు.
#మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే,
దర్శకత్వం,
నాన్ సింక్ సీన్స్.
#రేటింగ్ : 2.5 / 5
READ ALSO : తెలంగాణ లో కోమటి రెడ్డి సత్తా ఎంతో ప్రియాంక ఒక అంచనాకి వచ్చారా ?