• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » Lingashtakam Lyrics in Telugu and Bramamurari Surachitha lingam lyrics: తెలుగు లింగాష్టకం..!

Lingashtakam Lyrics in Telugu and Bramamurari Surachitha lingam lyrics: తెలుగు లింగాష్టకం..!

Published on March 30, 2023 by mohan babu

Advertisement

Lingashtakam Lyrics in Telugu: సాధరణంగా హిందువులతో ఎక్కువగా చదవబడే స్తోత్రాలలో లిగాష్టకం ఒకటి.  ఇందులో మొత్తం ఎనిమిది చరణాలుంటాయి. ప్రతీ చరణం కూడా పరమశివుడుని స్తుతిస్తూ రాయబడింది. ముఖ్యంగా ఈ లింగాష్టక స్తోత్రాన్ని చదవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. అదేవిధంగా చెడు అలవాట్ల నుంచి క్రమక్రమంగా దూరమవుతారు. లింగాష్టకంకి సంబంధించిన స్తోత్రాలు మరియు దాని యొక్క తెలుగు అర్థం కింద సవివరింగా ఇచ్చాం. వీటిని చదువుకొని మనశ్శాంతిని పొందండి.

Advertisement

also read: ఆస్కార్ అవార్డు 80 కోట్లకి కొన్నారు అనే కామెంట్ కి దానయ్య దిమ్మ తిరిగే రిప్లై ! ఏమన్నారంటే ?

Lingashtakam Lyrics in Telugu: తెలుగు లింగాష్టకం..! బ్రహ్మమురారి సురార్చిత లింగం

లింగాష్టకం అర్థం:

బ్రహ్మమురారిసురార్చిత లింగం 

నిర్మలభాసిత శోభిత లింగం 

జన్మజదు:ఖవినాశక లింగం 

తత్ప్రణమామి సదా శివ లింగం 

అర్థం :  

ఏ లింగంను అయితే బ్రహ్మ, విష్ణు తదితర సురులు అర్పించుదురో, ఏ లింగం అయితే నిర్మలత్వమును శోభతో కూడిన ఉన్నదో, ఏ లింగం జన్మమునకు ముడిపడి ఉన్నటువంటి దు:ఖములను నశించజేయగలదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నానని అర్థం.

దేవముని ప్రవరార్చిత లింగం 

కామదహం కరుణాకర లింగమ్ 

రావదర్పవినాశన లింగం 

తత్ప్రనమామి సదా శివ లింగమ్ II

 

అర్థం : 

ఏ లింగంను దేవతల యొక్క రుషుల తరతరాలు అర్పించుచున్నాయో.. ఏ లింగం కోరికలను కాల్చివేసి కరుణను కలిగి ఉందో, ఏ లింగం రావణాసురుడి గర్వము నాశనం చేసిందో, అలాంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థం.

 

సర్వసుగంధసులేపిత లింగం 

బుద్ధివివర్దణ కారణ లింగమ్

సిద్ధసురాసురవందిత లింగం

తత్ప్రణమామి సదా శివ లింగమ్ II

 

అర్థం : 

ఏ లింగం అన్ని రకాల సుగంధములచే అద్దబడిఉన్నదో, ఏ లింగం బుద్ధి వికాసమునకు కారణమై ఉన్నదో, ఏ లింగం సిద్దులు, దేవతలు, అసురుల చే వందనం చేయబడుతున్నదో అలాంటి సదా శివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థం.

 

కనకమహాణిభూషిత లింగం 

ఫణిపతివేష్టిత శోభిత లింగమ్ I 

దక్షసుయజ్ఞ వినాశన లింగం 

తత్ప్రణమామి సదా శివ లింగమ్ II

అర్థం : 

ఏ లింగం బంగారం, గొప్ప మణులచే అలంకరింపబడి ఉన్నదో ఏ లింగం సర్పరాజముచే చుట్టుకొనబడి అలంకరింపబడి ఉన్నదో, ఏ లింగం దక్ష యజ్ఞమును నాశనం చేసిందో, అటువంటి సదా శివ లింగమునకు నేను నమస్కరిస్తున్నానని అర్థం.

Advertisement

also read: ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !

Lingashtakam Lyrics in Telugu: తెలుగు లింగాష్టకం..! బ్రహ్మమురారి సురార్చిత లింగం

 

 

కుంకుమచందన లేపిత లింగం 

పంకజహారసుశోభిత లింగమ్ I

సంచిత పాపవినాశన లింగం 

తత్ప్రణమామి సదా శివ లింగమ్ II

అర్థం : 

ఏ లింగం కుంకుమ, గంధంతో అద్దబడి ఉన్నదో.. ఏ లింగం తామర పువ్వుల హారంతో అలంకరించబడి ఉన్నదో, ఏలింగం సంపాదించబడిన పాపరాశిని నాశనం చేయగలదో, అలాంటి సదాశివలింగానికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం.

దేవ గణార్చిత సేవిత లింగం 

భావైర్భక్తిభిరేవ ఛ లింగమ్ I

దినకరకోటి ప్రభాకర లింగం 

తత్ప్రణమామి సదా శివ లింగమ్ II

అర్థం : 

ఏ లింగం దేవగణములచే భావంతో, భక్తితో పూజించబడుతూ సేవింపబడుతున్నదో, ఏలింగం కోటి సూర్య సమానమైన శోభతో ఉందో, అటువంటి సదాశివ లింగమునకు నేను నమస్కరిస్తున్నానని అర్థం.

అష్టదళో పరివేష్టిత లింగం 

సర్వసముద్భవకారణ లింగమ్ I

అష్టదరిద్ర వినాశన లింగం 

తత్ప్రణమామి సదా శివ లింగమ్  II

అర్థం : 

ఏ లింగం అయితే ఎనిమిది దళములను చుట్టూ కలిగి ఉందో, ఏ లింగం సమస్త సృష్టికి కారణమై ఉందో, ఏ లింగం ఎనిమిది రకాల దరిద్రములను నశింపజేయగలదో, అలాంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నానని అర్థం. 

సురగురసురనరపూజిత లింగం 

సురవనపుష్పసదార్చిత లింగమ్ I 

పరాత్పరం పరమాత్మక లింగం

తత్ప్రణమామి సదా శివ లింగమ్ II

అర్థం : 

ఏ లింగం అయితే సురుల గురువు అనగా బృహస్పతి మరియు ఉత్తమమైన సురులతో పూజింపబడుతున్నదో, ఏ లింగం దేవతల పూలతోటలలో ఉన్న పువ్వులతో అర్చన చేయబడుతున్నదో, ఏ లింగం ఉత్తమమైన దానికంటే ఉన్నతమైన పరమాత్మ స్థాయిలో ఉందో అలాంటి సదా శివ లింగానికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం.

Lingashtakam Telugu Pdf   కోసం ఇక్కడ చెక్ చెయ్యండి

Check Here 

also read:ఆనంద్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. ఈమె ఎంతో మందికి ఆదర్శం..!!

Related posts:

కాశీ విశ్వేశ్వర ఆలయంలో శివుడికి ఎదురుగా నంది ఎందుకు ఉండదో మీకు తెలుసా..? Podupu-KathaluPodupu Kathalu, Riddles in Telugu with Answers: తెలుగు పొడుపు కథలు! మీకు కాబోయే భార్యతో పొరపాటున కూడా ఈ విషయాలను చర్చించకండి..!! Bible Quotes and Jesus Quotes in TeluguBible Quotes and Jesus Quotes in Telugu బైబిల్ సూక్తులు తెలుగు

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd