Advertisement
Lingochha movie Review : కార్తీక్ రత్నం, సుప్యర్ద సింగ్ జంటగా ఆనంద్ బడాని దర్శకత్వంలో యాదగిరి రాజు నిర్మించిన చిత్రం ‘లింగోచ్చా’. ఈనెల 27న అంటే ఇవాళ ఈ సినిమా విడుదల అయింది. ఈ సినిమాకు నిర్మాత యాదగిరి రాజు, చిత్ర సమర్పకురాలు జి.నీలిమ, ప్రొడక్షన్ డిజైనర్ అనిల్ కుమార్ తీగల పనిచేశారు. మరి ఓల్డ్ సిటీ కథ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…
Advertisement
కథ మరియు వివరణ :
‘లింగోచ్చా’ సినిమా కథ విషయానికి వస్తే, హైదరాబాద్ పాతబస్తీలో అల్లరి చిల్లరగా తిరిగే బార్బర్ కుమారుడు శివ… నవాబు కుటుంబానికి చెందిన నూర్జహాన్ ను చిన్నతనంలో తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. శివ, నూర్జహాన్ బాల్యంలోనే విడదీయలేనంతగా ఒకరినొకరు ఇష్టపడతారు. అయితే ఉన్నట్టుండి నూర్జహాన్ దుబాయ్ కి వెళ్ళిపోతుంది. కానీ శివ మాత్రమే తన ప్రియురాలిని ఊహించుకుంటూ బతికేస్తుంటాడు. ఆ తర్వాత కొన్నేళ్ళకి నూర్జహాన్ హైదరాబాద్ కు తిరిగివచ్చి మెడికల్ స్టూడెంట్ గా ఎంబిబిఎస్ చదువుతుంటుంది.
Advertisement
నూర్జహాన్ పై ఎలాంటి పరిస్థితుల్లో శివకు ప్రేమ పుడుతుంది. హైదరాబాద్ ను వదిలేసి నూర్జహాన్ దుబాయ్ కి ఎందుకు వెళ్ళింది? ఎంబిబిఎస్ చదివే నూర్జహాన్ ను తన ప్రేమ విషయంలో శివ ఎలా ఒప్పించాడు అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చాలా ఆసక్తిగా తీశారు దర్శకులు. అలాగే హైదరాబాదులోని పాతబస్తీ ఏరియాలను చాలా చక్కగా ఈ సినిమాలో చూపించారు. అలాగే అక్కడక్కడ కామెడీ సీన్లు… అటు ఎమోషనల్ సీన్లు కూడా అందర్నీ ఆకట్టుకుంటాయి. మొత్తానికి ఈ సినిమా ఆవరేజ్ హిట్ అని చెప్పవచ్చు.
పాజిటివ్ పాయింట్స్ :
కార్తీక్ రత్నం
కథ
మైనస్ పాయింట్స్ :
సాగదీత
దర్శకత్వం
రేటింగ్ : 2/5
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!