Advertisement
మునుగోడు ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఆ నియోజకవర్గంలో పోటాపోటీగా ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని ప్రధాన పార్టీలు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశాయి. దీంట్లో భాగంగానే పెద్ద ఎత్తున నగదు అలాగే మద్యం పంపిణీ చేశాయి పార్టీలు. ప్రచార సమయంలో పలుచోట్ల ఆయా పార్టీలు బహిరంగంగానే మద్యం బాటిల్లను పంపిణీ చేశాయి.
Advertisement
మునుగోడు లోని ఆయా మండలాలలో ఏకంగా వైన్ షాపులనే లీజుకు తీసుకొని మరి కొన్ని రాజకీయ పార్టీలు మద్యం పంపిణీకి తెరలేపినట్లు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. మద్యం పంపిణీ అలాగే నగదు పంపిణి మధ్య పోలింగ్ మూడో తేదీన పూర్తి అయింది. ఈ నేపథ్యంలోనే మద్యం అమ్మకాల చిట్టాను ఎక్సైజ్ శాఖ విడుదల చేసింది. తెలంగాణలో మద్యం ఏరులై పారుతోందని… ఈ మునుగోడు ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఈ అమ్మకాలు ఇంకా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక మద్యం అమ్మకాలకు బాగా కలిసొచ్చింది.
Advertisement
సెప్టెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖకు మధ్య నమ్మకాల ద్వారా ఏకంగా 2700 కోట్లు సమకూరితే… ఈ అక్టోబర్ మాసంలో ఈ అమ్మకాలు ఏకంగా 3037 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో కేవలం మునుగోడు లోనే ఏకంగా 300 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయని నివేదికలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఉప ఎన్నికల వేల మునుగోడులో మద్యం పంపిణీ జోరుగా సాగినట్లు తెలుస్తోంది. ఆప్కారి శాఖ లెక్కల ప్రకారం అక్టోబర్ 22వ తేదీ వరకే మునుగోడులో ఏకంగా 1060 కోట్ల విలువ చేసే మద్యం అమ్ముడైంది. మిగతా అమ్మకాలు మొత్తం మిగిలిన ఎనిమిది పది రోజుల్లో జరిగినట్లు సమాచారం అందుతుంది. నల్గొండ జిల్లా మొత్తం మీద ప్రతినెల సుమారు 132 కోట్ల మద్యం విక్రయాలు జరిగితే.. ఈ ఉప ఎన్నిక కారణంగా కేవలం మునుగోడు లోనే ఏకంగా 300 కోట్ల మేర అమ్మకాలు జరగటం గమనార్హం. ఈ లెక్కలు చూస్తూ ఉంటే మునుగోడులో ఏ మేరకు మద్యం ప్రవాహం జరిగిందో మనకు అర్థం అవుతుంది.
ఇవి కూడా చదవండి : టి20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన ఆస్ట్రేలియా !